Protests for party tickets

Protests for party tickets in TRS, TDP and Congress party, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Protests for party tickets in TRS, TDP and Congress party

టికెట్ కోసం చెట్టెక్కిన తెరాస నాయకుడు!

Posted: 04/09/2014 11:15 AM IST
Protests for party tickets

ఒక చేత్తో కిరోసిన్ డబ్బా మరో చేత్తో కర్రకు అంటించిన నిప్పుతో చెట్టు మీదకు ఎక్కి కూర్చున్న తెలంగాణా రాష్ట్ర సమితి మెదక్ జిల్లా సెక్రటరీ జింకా వెంకటేశమ్ ముదిరాజ్ ను ఫొటోలో చూడవచ్చు.  ఆయనకు ఈ ఎన్నికలలో పార్టీ టికెట్ లభించకపోవటమే అందుకు కారణం.  మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మరో తెరాస పార్టీ కార్యకర్త శ్రీశైలం కూడా పార్టీ ఆఫీస్ ముందున్న చెట్టెక్కి కూర్చున్నారు.  రెండుసార్లు ఎన్నికలలో ఓటమిని చవిచూసిన మదన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వటమే అందుకు కారణం.  గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ప్రదీప్ కూడా తనకి పార్టీ టికెట్ లభించనందుకు తెలంగాణా భవన్ లో గందరగోళాన్ని సృష్టించారు.

ఇలాంటి వివిధ తరహా నిరసనలు, విచిత్రమైన సన్నివేశాలు ఒక్క తెరాసకే పరిమితమైనవి కావు.  కాంగ్రెస్ పార్టీ నిరసనకారులు గాంధీ భవన్ ముందు, తెలుగు దేశం పార్టీ టికెట్ లభించనందుకు ఆ పార్టీ ఆఫీస్ ముందు, చంద్రబాబు నాయుడు నివాసం ముందు, పొన్నాల లక్ష్మయ్య నివాసం ముందు కూడా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిరసన తెలియజేసినవారు మంగళవారం చాలా మందే ఉన్నారు.

కేవలం తమకు టికెట్ లభించలేదనే కాదు, మహిళలకు ప్రాధాన్యతనివ్వలేదని, కోరిన స్థానానికి టికెట్ దొరకలేదని, ఇలా వివిధ రకాల నిరసనలు వెల్లువెత్తాయి.  ఒక కుటుంబం నుంచి ఒకే అభ్యర్థి అన్న కాంగ్రెస్ పార్టీ మీద కూడా నిరసనలు వచ్చాయి. 

అభ్యర్థులుగా టికెట్ కోరుకునేవారికి వారి సంక్షేమమే కావలసింది.  కానీ పార్టీ నాయకులకు మొత్తం మీద పార్టీ గెలుపే ముఖ్యం.  అందువలన వాళ్ళ ఆలోచనా విధానంలో తేడా ఉంటుంది.  దానితోపాటు ఈసారి ఎన్నికలలో పొత్తుల వలన, కొత్తగా పార్టీలలో చేరిన ఇతర పార్టీలలోని నాయకుల వలన సీట్ల అడ్జస్ట్ మెంటులో పార్టీ అధినాయకత్వం ఎంత కసరత్తు చేసినా ఎవరో ఒకరు మిగిలిపోవటం జరుగుతోంది.  అయితే అభ్యర్థిత్వాన్ని అర్థించేవారిని కూడా తప్పుపట్టటానికి లేదు.  ఈ అవకాశం వదులుకుంటే మరో ఐదు సంవత్సరాల వరకు చేతులు ముడుచుకుని ఉండవలసిందే. 

అందుకే పార్టీలు కూడా వీలయినంత వరకు జాబితాను విడుదల చెయ్యటం లో జాప్యం చెయ్యటం జరిగింది.  దీనితో ఏ స్థానంలో ఎవరిని నిలబెడతారో తెలియక అవతలి పార్టీలు తబ్బిబ్బులు పడటం, తెలిసిన తర్వాత తదనుగుణంగా తమ పార్టీ అభ్యర్థులను మార్చటం, లేదా అవతలి పార్టీలో టికెట్ దొరక్క బెదిరింపు కార్యక్రమంలో ఉన్నవారిని తమ పార్టీలోకి లాగటానికి చూడటం ఇలాంటి వాటివలన అభ్యర్థుల జాబితాలు చాలా ఆలస్యంగా తయారయ్యాయి. 

నిరసనలతో చకచకా పార్టీ ఖండువాలు మార్చుకున్నవారు కూడా సీనియర్ నాయకుల్లో ఉన్నారు.  ఈ సారి ఎన్నికలను సునిశితంగా పరిశీలిస్తే రాజకీయ రంగంలో ఆసక్తిగలవారు తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, ఎంతో దొరుకుతోంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles