Unsolved mystery of malaysian civilian flight mh 370

unsolved mystery of Malaysian civilian flight MH 370, Missing Malaysian flight Boeing 777-200, Missing Malaysian flight with 239 on board

unsolved mystery of Malaysian civilian flight MH 370

అంతులేని కథ, అతి పెద్ద ఖర్చు- మలేషియా విమానం

Posted: 04/09/2014 12:13 PM IST
Unsolved mystery of malaysian civilian flight mh 370

ఎప్పిటికప్పుడు తప్పిపోయిన మలేషియా విమానం గురించి కథనాలు వస్తున్నా, సరిగ్గా నెల రోజుల క్రితం కౌలాలంపూర్ నుంచి బయలు దేరి అందులోని 239 మందితో సహా అదృశ్యమైపోయిన మలేషియన్ పౌర విమానం ఎమ్ హెచ్ 370 గురించి ఎటువంటి విశ్వసనీయమైన భోగట్టా లభించలేదు.

సముద్రంలో వివిధ ప్రాంతాల్లో మునిగిపోయిందని, దారి మళ్ళిందని, ఆ విమానంలో నకిలీ పాస్ పోర్టులతో ప్రయాణం చేసినవారున్నందువలన ఉగ్రవాద చర్య అవచ్చని, పైలట్ల ఆత్మహత్యా ప్రయత్నమని ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి  కానీ ఏదీ ఇదమిద్ధంగా తేలలేదు కానీ సముద్రం మీద తేలుతున్నట్టుగా శాటిలైట్ ఫొటోలలో కనిపించినదాన్నిబట్టి, ఈ మధ్య కాలంలో నావికులకు వినిపించినట్లనిపించిన సిగ్నల్స్ ఆధారంగా ఆ విమానం కోసం చేస్తున్న గాలింపు కార్యక్రమం కొనసాగుతునేవుంది. 

ఈ గాలింపులో ఇంత వరకు అయింది విమాన చరిత్రలోనే చాలా అధికమైన ఖర్చుగా తెలుస్తోంది.  వివిధ దేశాలు సముద్రంలోనూ విమానాల ద్వారా చేపట్టిన గాలింపు చర్యలో అన్నీ కలిపి రోజూ మిలియన్ డాలర్ల ఖర్చు అవుతోంది.  వివిధ సాధనాలు, గాలింపు చర్యలో సిద్ధహస్తుల ప్రయత్నాలు ఇవన్నీ కలిపి కానరాని ఖర్చువుతున్న తరుణంలో ఇంకా ఖర్చు పెట్టటం వలన ప్రయోజనమేమైనా ఉంటుందా అని ఆలోచించే రోజులు వచ్చాయి. 

ఎంత వెతికినా ఆచూకీ తెలియటం లేదు.  ఏం చేస్తాం మరి.  ప్రాణాలను నిలబెట్టే పరికరాల ద్వారా రోగిని మృత్యువునుంచి కాపాడుతున్నట్లే ఇది కూడా.  ఇక చాలు అనుకుంటే ఆ పరికరాలలోని వైర్లు పీకేస్తే సరిపోతుంది.  అందువలన ఏదేశానికాదేశం ఎంతవరకు ముందుకెళ్ళాలన్నది వాళ్ళే ఆలోచించుకోవాలంటున్నారు కౌలాలంపూర్ లో ఆసియన్ స్ట్రాటజీ అండ్ లీడర్ షిప్ ఇన్స్ స్టిట్యూట్ ఛైర్మన్ రామోన్ నవరత్నం. 

అసలు ఏమైందా విమానానికి అన్నది తెలుసుకోవటం వలన మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నది గాలింపులో పాల్గొన్న దేశాల ఉద్దేశ్యం.  అంతు చిక్కని విమానం కోసం నెల రోజులుగా మిలియన్ డాలర్ల ఖర్చు పెడుతున్న దేశాలు ఎప్పటికప్పడు ఇకనైనా ఆచూకీ తెలుస్తుందేమోనన్న ఆశతో ఏ చిన్న విషయం దృష్టికి వచ్చినా వదలకుండా వెతుకుతూవున్నాయి. 

కానీ మలేషియన్ ఫ్లైట్ ఎమ్ హెచ్ 370 రహస్యం ఇంకా రహస్యంగానే మిగిలిపోవటం విచారకరం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles