తెలంగాణా ప్రాంతంలో 13 లోక్ సభ స్థానాలలోను, 80 అసెంబ్లీ స్థానాలలో పోటీకి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కొత్తగా పార్టీలో చేరిన మాజీ డిజిపి దినేష్ రెడ్డి కి లోక్ సభ స్థానం లభించింది.
లోక్ సభ అభ్యర్థులు-
1.అదిలాబాద్- ఆదె లీలారాణి, 2. కరీం నగర్- మీసాల రాజారెడ్డి, 3. నిజామాబాద్-ఎన్ రవీందర్ రెడ్డి, 4. జహీరాబాద్- ఎమ్ డి మొహియిద్దీన్, 5. మల్కాజ్ గిరి- దినేష్ రెడ్డి, 6. హైద్రాబాద్- బొడ్డు సాయినాధ రెడ్డి, 7. నాగర్ కర్నూల్- జెట్టి ధర్మరాజు, 8. నల్గొండ- గున్నం నాగిరెడ్డి, 9. మహబూబాబాద్- తెల్లం వెంకట్రావు, 10. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాస రెడ్డి, 11. చేవెళ్ళ- కొండా రాఘవరెడ్డి, 12. మహబూబ్ నగర్- అబ్దుల్ రెహమాన్, 13. మెదక్- ప్రభు గౌడ్.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నినాదాలు చేసినవారు, రాష్ట్ర విభజన జరుగుతుందని తెలియగానే రాజీనామాలు చేసి నిరసనలు తెలియజేసిన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్థానాలకు, 80 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టగా, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి అభ్యంతరం లేదని, కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే మద్దుతనిస్తామని ప్రకటించిన తెలుగు దేశం పార్టీ మాత్రం తెలంగాణాలో స్థానాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చెయ్యవలసి వస్తోంది.
అదీ తెలంగాణా రాష్ట్ర సమితి ఆడిన రాజకీయం. ఎప్పుడు రాష్ట్ర విభజన చర్చకు వచ్చినా, లేదా తెలంగాణాలో అభివృద్ధి గురించి మాట వచ్చినా తెరాస పెద్ద ఎత్తున తెదేపాను ఎండగడుతుండేది. తెలంగాణా, ఆంధ్ర ఇరు ప్రాంతాలు నాకు రెండు కళ్లలాంటివని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించి, హాస్యంలోకి మార్చి రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేసిన తెరాస తో పాటు కాంగ్రెస్ పార్టీ, వైయస్ ఆర్ పార్టీ కూడా ఇతర పార్టీల గురించి ఏం మాట్లాడినా తప్పని సరిగా తెదేపానే లక్ష్యంగా విమర్శలు గుప్పించేవారు. మిగిలిన పార్టీలన్నిటికీ తెదేపా మీద విరుచుకు పడటమే ధ్యేయంగా నిలిచింది. అందుకే తెదేపా తెలంగాణాలో నిలదొక్కుకోలేకపోయింది.
విచిత్రమేమిటంటే, తెలంగాణాలో మాట్లాడేటప్పుడు తెలంగాణాకు వ్యతిరేకని, సీమాంధ్రలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు వలనే రాష్ట్రం విడిపోయిందని అన్ని పార్టీల వారూ చెప్పటం చేస్తుండేవారు. అందుకు వైకాపా మినహాయింపేమీ కాదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more