Malasia airlines lost contact

Malaysia airlines lost contact, Kuala Lumpur to Beijing flight missing, Malaysian flight 239 on board

Malaysia airlines lost contact, Kuala Lumpur to Beijing flight missing

ఆచూకీ తెలియని మలేషియా విమానం

Posted: 03/08/2014 08:14 AM IST
Malasia airlines lost contact

227 ప్రయాణీకులతో 12 మంది విమాన సిబ్బందితో మొత్తం 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి బయలుదేరిన బోయింగ్ 777-200 విమాన సేవ ఎమ్ హెచ్ 370 విమానం తెల్లవారు ఝామున 2.40 నుంచి సమాచార వ్యవస్థ తెగిపోయి ఆచూకీ తెలియటం లేదు.  కౌలాలంపూర్ నుంచి ఈ విమానం అర్ధరాత్రి 12.41 కి బయలుదేరిన ఈ విమానం ఉదయం 6.30 కి చేరవలసింది. 

విమానాన్ని వెదకటానికి రక్షణ సిబ్బంది బయలుదేరింది.  విమానం నుంచి అన్ని సమాచార సంబంధాలు తెగిపోయాయని చెప్పటానికి చింతిస్తున్నామంటూ విమాన సేవల ప్రధానాధికారి అహ్మద్ జౌహారి యాహ్యా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. 

ఆచూకీ తెలియని విమానాన్ని వెదకటానికి, అవసరమైతే రక్షక చర్యలు చేపట్టటానికి అధికారులతో కలిసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామన్నారు యాహ్యా.  ఆ విమానంలో 13 దేశాలకు చెందిన ప్రయాణీకులున్నారు.  ఎవరితోనూ సమాచార సంపర్కం స్థాపితం కాకపోవటంతో అందరూ వారి సంగతి తెలుసుకోవటానికి ఆత్రుత చూపిస్తున్నారు.

హెల్ప్ లైన్ 60378841234 ని మలేషియా ఎయిర్ లైన్స ఏర్పాటు చేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles