Kejriwal explains flying in chartered plane

Kejriwal explains flying in chartered plane, AAP Arvind Kejriwal flies chartered plane, Narendra Modi, Rahul Gandhi

Kejriwal explains flying in chartered plane

ఆమ్ ఆద్మీ ప్రైవేట్ విమానం మెర్సిడీజ్ లో ప్రయాణం

Posted: 03/08/2014 08:40 AM IST
Kejriwal explains flying in chartered plane

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తన నాలుగు రోజులు గుజరాత్ పర్యటన తర్వాత ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొనటం కోసం జైపూర్ వెళ్ళారు.  విమానాశ్రయం నుంచి హోటల్ కి మెర్సెడిస్ కారులో చేరుకున్నారు.  అక్కడి నుండి ఢిల్లీకి ప్రైవేట్ విమానంలో చేరుకున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెలికాప్టర్లు, విమాన ప్రయాణాల మీద మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానిస్తూ వచ్చిన కేజ్రీవాల్ ప్రైవేట్ విమానంలో ప్రయాణం చెయ్యటం మీద సోషల్ మీడియాలో సంచలనం రేగుతున్న సందర్భంగా కేజ్రీవాల్ వివరణనిచ్చారు. 

ఇండియా టుడే నిర్వహిస్తున్న సమావేశానికి ఈరోజు వచ్చాను.  రెగ్యులర్ ఫ్లైట్ లేకపోవటం వలన ఇండియా టుడే గ్రూప్ నా కోసం ఖర్చులు భరించి నేను ఢిల్లీకి సకాలంలో చేరుకోవటం కోసం విమానాన్ని ఏర్పాటు చేసింది అంటూ కేజ్రీవాల్ తన ట్విట్టర్లో ప్రకటించారు.  మోదీ గారు, రాహుల్ గాంధీలు కూడా అలాగే వారు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లు విమాన ఖర్చులను ఎవరు భరిస్తున్నారన్నది తెలియజేయవలసి వుంటుంది అన్నారాయన. 

మోదీ మీడియాని కలవలేదు, ప్రత్యేక విమానాలలో వెళ్ళి ప్రసంగాలిచ్చి తిరిగివచ్చారంతే.  ఇదేనా ప్రజాస్వామ్యం అని కేజ్రీవాల్ ప్రశ్నించారు జైపూర్ మీడియా సమావేశంలో.  ప్రజలంతా మోదీ వైపు మొగ్గు చూపిస్తున్నారని అన్న మీడియా ప్రతినిధులకు, కేజ్రీవాల్ అదేం కాదన్నారు.  ఇది మోదీ వేవ్ కాదు ప్రజల క్రోధాగ్ని.  ఇది దేశంలో పెను మార్పులను తీసుకునిరాబోతున్నది అని సమాధానమిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles