More migrations to tdp

More migrations to TDP, Galla Aruna Kumari, Galla Jayadev, Telugu Desam Party, Chandra Babu Naidu, Amara Raja Group of Companies

More migrations to TDP, Galla Aruna Kumari, Galla Jayadev

తెదేపా లోకి మరిన్ని వలసలు

Posted: 03/08/2014 07:50 AM IST
More migrations to tdp

కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి మరో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఈ రోజు చేరబోతున్నారు.  వారు రాష్ట్ర మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, ఆమెతో పాటు ఆమె కుమారుడు గల్లా జయదేవ్ లు.  ఎన్నికలలో ఏ పార్టీకీ మద్దతుగా ప్రచారం చెయ్యకపోయినా గల్లా అరుణ కుమారి కోసం ప్రచారంలో పాల్గొనటానికి మహేష్ బాబు సిద్ధమయ్యారు.  ఈ విషయాన్ని జయదేవ్ లోగడ ప్రకటించారు.  తల్లి శాసనసభకి, తనయుడు లోక్ సభకు పోటీచెయ్యటానికి తెదేపాతో ఒప్పందం కుదిరింది.  తల్లి శాసనసభకి, తనయుడు లోక్ సభకు పోటీచెయ్యటానికి తెదేపాతో ఒప్పందం కుదిరింది.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి రాష్ట్ర గనుల శాఖకు మంత్రిగా పనిచేసిన గల్లా అరుణ కుమారి ఈ సారి కూడా తెదేపా తరఫున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇక ఆమె కుమారుడు జయదేవ్ గుంటూరు నుంచి లోక్ సభకు పోటీ చెయ్యనున్నారు.  గల్లా అరుణ కుమారి సమాజసేవకుడు, పార్లమెంట్ సభ్యుడైన పాటూరి రాజగోపాల నాయుడు కూతురు. 

 

గల్లా అరుణ కుమారి లోగడ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి కార్యదర్శిగా పనిచేసారు.  కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రురాలైన ఆమె వైయస్ఆర్ హయాంలో ఆరోగ్య విద్య, బీమాలకు మంత్రిగా పనిచేసారు.  ఆరోగ్యశ్రీ ఆవిర్భావానికి గల్లా అరుణ కుమారే బాధ్యురాలు.  ఈవిడ తెలుగులో ఎన్నో నవలలు కూడా రాసారు. 

ఇక ఈమె కుమారుడు జయదేవ్ వ్యాపార వేత్త.  అమరరాజా గ్రూప్ సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.  వీరిద్దరి చేరిక తెదేపాకు బలం చేకూరుస్తుందని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles