Bandh in bhadrachalam division and khammam dist

Bandh in Bhadrachalam division, Bandh in Khammam district, demand to change Polavaram Project design, CPM Dharna in Bhadrachalam division, Flood hit tribal areas in Polavaram project

Bandh in Bhadrachalam division and Khammam district demanding change in Polavaram Project

బంద్ లో భద్రాచలం డివిజన్

Posted: 03/06/2014 09:35 AM IST
Bandh in bhadrachalam division and khammam dist

సిపిఎమ్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ ని మార్చాలంటూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 

భద్రాచలం డివిజన్ లో ముంపు అనేది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తూ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చవలసిందిగా సిపిఎమ్ పోరుబాట పట్టింది.  అందుకు మద్దతు లభించి బంద్, ఆందోళనలను నిర్వహిస్తున్న సిపిఎమ్ ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది. 

భద్రాచలం డివిజన్ లో ఈ రోజు ఉదయం నుంచే బంద్ ని విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ఆందోళన సాగిస్తున్నారు.  ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ అమలు జరుగుతుండటంతో పలు ప్రాంతాలకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. 

పోలవరం ప్రాజెక్ట్ వలన భద్రాచలం డివిజన్ లో ముంపుకి గురవటమే కాకుండా వందలాది గిరిజనలు నిరాశ్రయులై తమ సంస్కతి సంప్రాదాయాలను కూడా పోగొట్టుకుంటారన్నది సిపిఎం ఆందోళన.  వారి జీవన శైలిని మార్చివేసే అధికారం ప్రభుత్వానికి లేదని సిపిఎమ్ బలమైన వాదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles