Gujarat not developed as modi says kejriwal comments

Gujarat not developed as Modi says Kejriwal comments, Aravin Kejriwal Gujarat tour, Aam Admi Party, Bharatiya Janata party, BJP Prime Ministerial candidate Narendra Modi

Gujarat not developed as Modi says Kejriwal comments

గుజరాత్ లో అంత లేదు- కేజ్రీవాల్

Posted: 03/06/2014 09:13 AM IST
Gujarat not developed as modi says kejriwal comments

ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా గుజరాత్ లోని అభివృద్ధి గురించి మాట్లాడుతూ దేశాన్నంతా అలాగే సస్యశ్యామలం, సుభిక్షం, సుపరిపాలనతో వ్యాపార వాణిజ్య సాంకేతిక ప్రగతిని సాధిస్తామని చెప్తూ వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మాటలలోని నిజానిజాలను తరచిచూడటానికి గుజరాత్ లో నాలుగు రోజుల పర్యటనలో తిరుగుతున్న ఆఆపా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, అదంతా ఏమీ లేదు అంటూ నోరు చప్పరించేసారు. 

రోడ్ షో కి అనుమతి లేదంటూ కేజ్రీవాల్ ని రాధన్ పూర్ లో పోలీసులు అడ్డుకోవటం, భాజపా కార్యకర్తలు ఆఆపా వర్గాల మీద దాడిచెయ్యటం అంతా గుజరాత్ లో పెద్దల కనుసన్నలలో, అండదండలతోనే జరిగాయన్నారు కేజ్రీవాల్.  నీరు, విద్యుత్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలు మోదీ చెప్పిన స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఏమీ లేవని అన్నారాయన. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అనుమతులు లేకుండా ఆందోళనలు నిరసనలు చెయ్యగూడదన్న సంగతి వివరించటానికే కేజ్రీవాల్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళటం జరిగిందన్నారు గుజరాత్ లో పఠాన్ జిల్లా ఎస్పీ పరీక్షిత్ రాథోడ్.  అయితే కార్లకి స్టిక్కర్లు కానీ పార్టీ జెండాలు కానీ లేవని, ఆ సంగతి వివరించామని, అయినా తమని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారని కేజ్రీవాల్ ఆరోపించారు. 

నర్మదా వ్యతిరేకి, కాంగ్రెస్ ఏజెంట్ అంటూ భాజపా కార్యకర్తలు పలు ప్రాంతాల్లో కేజ్రీవాల్ బృందానికి తెలియజేసారు.  అయితే కేజ్రీవాల్ కి స్వాగతం పలికిన ఆఆపా కార్యకర్తలు కూడా, షీలా దీక్షిత్ ని పడగొట్టారు, ఇక మోదీ వంతు వచ్చిందంటూ నినాదాలు చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles