Pawan kalyan meets gaddar

Pawan Kalyan meets Gaddar, Pawan Kalyan entering politics, Pawan Kalyan Political party, Gaddar meets Pawan Kalyan, Cine Producer Dil Raju

Pawan Kalyan meets Gaddar

తెలంగాణా ఉద్యమ నాయకుడు గద్దర్ తో పవన్ కళ్యాణ్ భేటీ

Posted: 03/06/2014 10:01 AM IST
Pawan kalyan meets gaddar

రాజకీయ నాయకులను మరీ యుక్తవయసులోని ఆడపిల్లల్లా చూస్తారు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.  ఎవరు ఎవరిని కలుస్తున్నారన్నది కనిపెట్టి అందుకు కారణాలను వెతుక్కుంటూ, తమకు తగ్గ భాష్యాలు తాము చెప్పుకుంటుంటారు.  ఏ విందు పార్టీలోనో లేక వేడుకలలోనో కలిసినా సరే కాస్త నవ్వుతూ పలకరించుకున్నారంటే పార్టీ పొత్తులు, పార్టీ మార్పులు, పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అనుమానపడుతుంటారు. 

సరిగ్గా అలాగే జరిగింది పవన్ కళ్యాణ్ విషయంలో.  అసలే రాజకీయాలలోకి వస్తున్నారని రాష్ట్రమంతా కోకిలై గానం చేస్తున్న సమయంలో గద్దర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అవటం అత్యంత ఆసక్తి కరంగా మారింది. 

కానీ ఆ భేటీ రాజకీయ రంగంలో వ్యవహారాలకి కాదని, సినిమా రంగంలోని కార్యకలాపాల కోసమని తెలిసి రాజకీయ పార్టీలు హాయిగా గాలి పీల్చుకున్నాయి.  రకరకాల మార్పులతో పార్టీల జయాపజయాల మీద అంచనాలు వేగంగా మారిపోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారన్న విషయం కాస్త అలజడిని రేపటానికి కారణం పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానుల సంఖ్య.  అన్నిటికీ మీతో ఉంటాం, మీ వెనకే నడుస్తాం మిమ్మల్న గెలిపించటంలో నే మాకు ఆనందం అనే అభిమానుల అండదండలు రాజకీయ పార్టీలకు కాస్తంత గుబులు పుట్టించటం సామాన్యమే. 

అయితే తెలంగాణా నాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబోతున్న సినిమా స్క్రిప్ట్ లో తనవంతు సాయం చేస్తున్న ప్రజా గాయకుడు గద్దర్ ఈ పాత్రను ధరించటానికి పవన్ కళ్యాణ్ ని ఒప్పించటానికి ఆయనను కలుసుకున్నారు.  ఈ సినిమా నిర్మాణానికి దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారు.  అయితే ఇంకా చర్చల స్థాయిలోనే ఉందీ ప్రాజెక్ట్.  అంగీకారాలు, ఒప్పందాలు జరగాల్సిందింకా ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles