Kiran kumar knocking doors of supreme court

Kiran Kumar knocking doors of Supreme Court, Petition opposing State bifurcation, Former CM petition in SC, Kiran Kumar Reddy

Kiran Kumar knocking doors of Supreme Court, Petition opposing State bifurcation

సుప్రీం కోర్టు తలుపుతడుతున్న కిరణ్ కుమార్

Posted: 03/05/2014 10:47 AM IST
Kiran kumar knocking doors of supreme court

సమైక్యాంధ్రప్రదేశ్ లో ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మూలాలతో గద్దెనెక్కినా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం రాష్ట్రానికీ పార్టీకీ కూడా మేలు చేస్తుందని మొదటి రోజు నుంచీ చెప్తూ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తన మాటలను ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా మొండివైఖరితో దూకుడుగా రాష్ట్ర విభజన బిల్లును తయారు చేసి శాసనసభకు పంపితే దాన్ని శాసన సభలో తిరస్కరించి కూడా చరిత్రను సృష్టించారు. 

రాష్ట్ర విభజనకు చట్టబద్దత లేదంటూ పలుమార్లు సుప్రీం కోర్టుకి పిటిషన్లు వెళ్ళినా అప్పటికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోనందువలన ఆ పిటిషన్ కి ఇంకా సమయం రాలేదంటూ సుప్రీం కోర్టు వాటిని తిరస్కరిస్తూ సరైన సమయంలో పిటిషన్లను వెయ్యవచ్చని కూడా సూచించటం జరిగింది. 

నాయకులంతా తమ తమ రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకుంటున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తన మాట మీద నిలబడి అదే పంథాలో సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు కానీ అందరూ అనుకున్నట్లుగా కొత్త పార్టీ వైపు దృష్టి పెట్టలేదు, సీమాంధ్ర బెబ్బులిగా పేరు వచ్చినా దాన్ని ఉపయోగించుకునే దిశగా అడుగులు వెయ్యలేదు. 

పిటిషన్ లో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని చేసిన అభియోగాలకు ఆయన పేర్కొన్న అంశాలు ఇవి-

ఆర్టికిల్ 371 డి ఉల్లంఘన, కొత్త రాజధాని గురించి చెప్పకపోవటం, 2013 డ్రాఫ్ట్ బిల్లు లోపభూయిష్టంగా ఉండటం, శాసనసభలో తిరస్కరించిన బిల్లును యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విధానం, బిల్లును ఆమోదించిన విధానం, గవర్నర్ కి ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిలాంటి వాటికి రాజ్యాంగ సవరణ చెయ్యకపోవటం మొదలైనవి.

అయితే, కిరణ్ కుమార్ చేస్తున్న ధీరోదాత్తమైన ఈ పనిని కూడా రాజీకీయ విశ్లేషకులు కొందరు అనుమానంగానే చూస్తున్నారు.  ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమా.  తెరాస అధ్యక్షుడు కెసిఆర్ విలీనానికి మొగ్గు చూపించకపోవటంతో మొత్తం రాష్ట్ర విభజన ప్రక్రియనే నిలిపివేద్దామని చూస్తున్నారా అని కూడా విమర్శలు వస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles