2014 general election schedule

2014 general election schedule, Lok Sabha polls schedule, Election commission of India, Lokpal and ombudsman appointment, Jairam Ramesh

2014 general election schedule, Lok Sabha polls schedule

2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

Posted: 03/05/2014 09:59 AM IST
2014 general election schedule

దేశంలోని 543 లోక్ సభ సభ్యులను ఎన్నుకోవటానికి రంగం సిద్ధమౌతోంది.  ఈరోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ని విడుదల చెయ్యబోతోంది. 

అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండవ వారం నుండి మే 16 వరకు 9 విడతలలో ఎన్నికలను నిర్వహిస్తారు.  ఎన్నికలకు ఇంత ఎక్కువ కాలాన్ని కేటాయించటం వలన భద్రతా సిబ్బందిని ఒకచోటి నుండి మరో చోటికి పంపించటానికి అవసరమైన వ్యవధి దొరకుతుంది, అన్ని చోట్లా అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లకు అవకాశం ఉంటుంది.

ఈరోజు షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశంలో ఎన్నికల నియమావళి అమలు లోకి వస్తుంది.  ఆ తర్వాత ప్రభుత్వం ఎటువంటి హామీలను ఇవ్వటానికి వీలుండదు.  అయితే లోక్ పాల్ నియామకం, అవినీతి నిరోధక అమలుకోసం ప్రత్యేక హోదాలో అడ్వకేట్ (అంబుడ్స్ మన్) నియామకాలు జరగటానికి ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇవ్వవచ్చు.  ఎందుకంటే ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కాబట్టి. 

ఇక సీమాంధ్రకు చేసిన హామీలకు కూడా ఢోకా లేదంటున్నారు రాష్ట్ర విభజనకోసం ఏర్పడ్డ మంత్రుల బృందంలో చురుగ్గా పాల్గొన్నకేంద్ర మంత్రి జైరామ్ రమేష్.  లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం మూడు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.  లోక్ సభ కాల పరిమితి జూన్  తోను, శాసనసభల పరిమితి జూన్ 2 తోనూ ముగియనున్నాయి. 

ఈసారి లోక్ సభ ఎన్నికలకు ఎలక్ట్రానికి వోటింగ్ మెషీన్ లో నోటా (ఏ అభ్యర్ధీ వద్దు) అని వోటర్ తెలియజేయటానికి అవకాశం కల్పించబడుతోంది.  కానీ దాని ఫలితాల మీద ఎలా స్పందించాలన్న విషయంలో ఇంకా చట్టబద్ధంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles