Crowded secretariat to move pending files

Crowded Secretariat to move pending files, Chief Minister Kiran Kumar Reddy, Pending files in Secretariat, Rush at secretariat to get clearances, Vigilance and Enforcement files pending

Crowded Secretariat to move pending files, Chief Minister Kiran Kumar Reddy

దీపముండగానే సచివాలయంలో చక్కదిద్దుకోవాలి

Posted: 02/13/2014 07:59 AM IST
Crowded secretariat to move pending files

దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది విద్యుద్దీపాలు లేనప్పటి పాత సామెత.  ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి రాజీనామా ఖాయమే అనిపిస్తున్న నేపథ్యంలో పెండింగ్ ఫైళ్ళను కదిలించటానికి బుధవారం హైద్రాబాద్ సచివాలయంలో రాజకీయనాయకులు, లాబీయిస్ట్ లు క్యూలు కట్టారు. 

అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు ముఖ్యమంత్రిని కలిసి వాళ్ళ పనులను చేయించుకోవటానికి, సగంలో ఆగిపోయివున్న పనులను చరమాంకానికి నడిపించటానికి వెళ్ళటంతో సచివాలయం కిక్కిరిసిపోయింది.  రాజకీయ నాయకులే కాక ఆఫీసులలో పనిచేయించి పెట్టేవారు బారులు తీరారు.

అన్నిటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు విడుదల కావలసిన నిధులు ఇంకా మిగిలివున్నాయి.  మంత్రులు వాటిని పూర్తిగా పట్టించుకోకుండా ఆలస్యం చేస్తూ రావటంతో అవి మురిగిపోతాయేమో అన్న భయం కూడా పట్టుకుంది.  సిఎమ్ రిలీఫ్ ఫండ్ స్పెషల్ గ్రాంట్ ఫండ్ లాంటి ఎమ్మెల్యేలకు అందవలసిన నిధులు ఇంకా మిగిలివున్నాయి. 

పెండింగ్ లో ఉన్న ఫైళ్ళల్లో ఉద్యోగుల మీద వేసిన వేటు కూడా ఉన్నాయి.  లంచగొండి ఉద్యోగుల మీద ఉన్న పెండింగ్ కేసులలో విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ శాఖలవారి ఫైళ్ళున్నాయి.  సిఎమ్ఆర్ఎఫ్ లో రోగులకు చెల్లించవలసిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి ఓపిగ్గా అన్నిటినీ శాంక్షన్ చెయ్యటంలో ఆసక్తి కనబరచారు. 

ఇవన్నీ కాకుండా పదోన్నతులకు సంబంధించిన దస్త్రాలు కూడా ఉన్నాయి.  అందువలన సచివాలయంలోనే కాక శాసనసభలో కూడా ముఖ్యమంత్రి ఛేంబర్ దగ్గర ఎందరో బారులు తీరి తమ పనులను చకచక చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సచివాలయం లోపల, బయట కూడా పార్కింగ్ స్థలాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles