Railways interim budget

railways interim budget, railway budget in parliament, Railway Minister Kharge

railways interim budget, railway budget in parliament

తిరుపతి ప్రయాణీకులకు రైల్వే శాఖ ప్రసాదం

Posted: 02/13/2014 08:47 AM IST
Railways interim budget

బుధవారం పార్లమెంట్ లో రైల్వే శాఖ 2014-15 కి ప్రతిపాదించిన మధ్యంతర బడ్జెట్ లో తిరుపతి ప్రయాణీకులకు సౌకర్యవంతమైన డబల్ డెకర్ రైలుని ప్రసాదించింది.  ఇది వారానికి రెండు సార్లు కాచీగూడ నుంచి బయలుదేరి తిరుపతికి ప్రయాణం చేస్తుంది. ఫొటోలో రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే

అలాగే మరో రెండు కొత్త రైల్ సేవలు కూడా ఆంధ్రప్రదేశ్ కి దక్కాయి.  ప్రతిరోజూ హైద్రాబాద్ గుల్బర్గా మధ్యలో నడిచే సర్వీస్ తో పాటు వారానికి రెండుసార్లు కాచిగూడా గుంటూరు మధ్యలో కూడా డబల్ డెకర్ రైళ్ళు నడుస్తాయి. 

రైల్వే బడ్జెట్ లో మొత్తం 55 కొత్త ఎక్స్ ప్రెస్ సేవలను ప్రకటించగా అందులో 15 దక్షిణ మధ్య రైల్వేకే దక్కాయి. కొన్ని రైలు సర్వీసులను వారానికి రెండు మూడు సార్లు నడిచేవాటిని ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని డైలీ సర్వీస్ గా మార్చటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles