Modi afraid of educated with fancy degrees

Modi afraid of educated with fancy degrees, Narendra Modi BJP Prime Ministerial candidate, Union finance minister Chidambaram, Rahul Gandhi, Sonia Gandhi

Modi afraid of educated with fancy degrees

చదూకున్నోళ్ళతో మా చావొచ్చింది- మోదీ భయం

Posted: 02/09/2014 11:44 AM IST
Modi afraid of educated with fancy degrees

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  ఎత్తుకు పై ఎత్తులు ఎత్తిపొడుపు మాటల్లో ఎవరెంత ప్రేక్షకులను నవ్విస్తే వాళ్ళంత గొప్ప వక్తలు, వారు చేసింది విజయవంతమైన ర్యాలీ అవుతోంది. 

ఇన్నాళ్ళూ మోదీ మీద గుజరాత్ 2002 అల్లర్లతో బురద రుద్దుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు తీర్పు, ఇతర మిత్ర పక్షాలు కూడా వారించటంతో దానికి స్వస్తి చెప్పే వేరే దార్లు వెతుక్కుంటోంది.  సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడంటే మావాడనే వాదులాట మొదలైంది.  ఆకట్టుకునే ప్రసంగాలు కావు పనిచేసే వాళ్ళే ముఖ్యమంటూ ఆమధ్య సోనీయా గాంధీ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ కూడా అందుక దీటుగా సమాధానం చెప్తూ వస్తున్నారు.  తాజాగా చెన్నైలో పర్యటించిన మోదీ చిదంబరం వ్యాఖ్యలను తిప్పికొడుతూ తానొక సామాన్యుడిగా పెద్ద పెద్ద విదేశీ చదువులు చదువుకున్నవారితో ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కుంటున్నానని అన్నారు. 

ఆర్ధిక శాస్త్రం గురించి మోదీ తెలిసిన దాన్ని చిన్న పోస్టల్ స్టాంప్ మీద రాయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బిబిసి ఛానెల్ అన్నదానికి మోదీ, స్టాంప్ అతికిస్తేనే ఉత్తరం డెలివరీ అవుతుందని, తాను గుజరాత్ లో అభివృద్ధి ద్వారా తన శక్తి సామర్థ్యాల గురించిన లేఖను డెలివరీ చేసానని అన్నారు.

హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో చదువుకున్న చిదంబరం తమ దగ్గరున్న పెద్ద శక్తిగా మోదీ అందుకు తూగలేరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగుతోంది.  దాన్ని తిప్పికొడుతూ, హార్వార్డా, హార్డ్ వర్కా మీరే నిర్ణయించుకోండన్నారు మోదీ చెన్నైలో.  పెద్ద పెద్ద డిగ్రీలు చూసి మోసపోకండి.  మీకు పనిచేసే నాయకులు కావాలి అని మోదీ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles