Automated sms confirmation to wait listed

Automated SMS confirmation to wait listed, IRCTC SMS service, CRIS software development wing, Indian Railways, Waitlist ticket confirmation by SMS

Automated SMS confirmation to wait listed

ప్రయాణీకుల సేవలో భారతీయ రైల్వే మరో ముందడుగు

Posted: 02/09/2014 12:41 PM IST
Automated sms confirmation to wait listed

జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని ఎప్పటికప్పుడు తన సొంతం చేసుకుంటూ ప్రయాణీకుల సేవలో మరో అడుగు ముందుకేస్తూ శాఖ ఆటోమేటిక్ ఎస్ఎమ్ఎస్ సేవలను టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత పంపే ఏర్పాటుని భారత రైల్వే చేస్తోంది.

మొబైల్ ఫోన్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఇప్పటికే కలిగించిన ఐఆర్ సిటిసి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకులకు 139 కి డయల్ చేసి రిజర్వేషన్ స్టాటస్ ని తెలుసుకునే అవకాశం కల్పించింది.  దాని వలన కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు ఎన్నోసార్లు ఎస్ఎమ్ఎస్ పంపించవలసివస్తోంది. 

అలా కాకుండా కన్ఫర్మ్ కాగానే అక్కడి నుండే ఎస్ఎమ్ఎస్ వస్తే ప్రయాణీకుల ఆత్రుత తగ్గుతుంది.  రైల్వే స్టేషన్ కి వచ్చేంత వరకు రిజర్వేషన్ విషయంలో ఏం జరిగిందో ప్రయాణం సాగుతుందో లేదో అన్న ఆదుర్దాలో ఉంటారు.  కానీ ఈ వెసులుబాటు వలన ప్రయాణీకులకు స్వాంతన లభిస్తుంది.

అందువలన ఇటువంటి ఆటోమేటెడ్ మెసేజెస్ పంపించటంకోసం ఐఆర్ సిటిసి తన సాఫ్ట్ వేర్ విభాగం క్రిస్ ద్వారా అవసరమైన మార్పులు చేస్తోంది.  వెయిట్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకుల రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన సందర్భంలో మాత్రమే వాళ్ళ వరకు ఈ మెసేజ్ వెళ్ళటానికి సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నారని రైల్వే అధికారులు తెలియజేసారు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles