Actor srihari wife may contest in elections

Actor Srihari wife may contest in elections, Character actor Srihari, Srihari wife Shanti, Hyderabad Kukatpally Constitution, Jayaprakash Narayana Kukatpally

Actor Srihari wife may contest in elections

శ్రీహరి భార్య శాంతి ఎన్నికలలో నిలబడే అవకాశం!

Posted: 02/09/2014 10:09 AM IST
Actor srihari wife may contest in elections

దివంగత సినీ నటుడు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు చేరువైన శ్రీహరి భార్య శాంతి రాబోయే ఎన్నికలలో కూకట్ పల్లి నుంచి పోటీ చెయ్యవచ్చునని సమాచారం. 

ఏ పార్టీ నుంచి పోటీ చేసేదీ ఇంకా ఇదమిద్ధంగా తేలకపోయినా, శ్రీహరికున్న మంచి పేరు శాంతి ని గెలిపిస్తుందనే నమ్మకం ఉంది.  శ్రీహరి రాజకీయాల్లో రావాలనుకున్న సమయంలో ముందు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కుకుట్ పల్లి నియోజకవర్గం నుంచి నిలబడటానికి టికెట్ ఇచ్చే వాగ్దానం లభించినా, జగన్ సమైక్యవాదం వినిపించిన తర్వాత శ్రీహరి ఆ పార్టీ నుంచి దూరమయ్యారని తెలుస్తోంది.  ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలోకి వచ్చారు.

కూకట్ పల్లి లోక్ సత్తా పార్టీ జయ ప్రకాశ్ నారాయణకి వేళ్ళూనిన నియోజకవర్గంగా పేరున్నా, ఆయన కూడా సమైక్యవాదాన్ని వినిపించటంతో కూకట్ పల్లి ఆయన చేతుల్లోంచి పోయినట్లుగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేస్తే శాంతి తప్పక విజయం సాధిస్తుందని అంచనా. 

ఇంకా ఏ వార్తనూ బలపరచకపోయినా, విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం శాంతి త్వరలోనే ఈ విషయాలను ధృవీకరించవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles