Rss principles caused gandhi assassination

RSS principles caused Gandhi assassination, Rahul Gandhi, Narendra Modi, Bharatiya Janata party, Rashtriya Swayamsevak Sangh

RSS principles caused Gandhi assassination

గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ విధానాలే కారణం- రాహుల్

Posted: 02/08/2014 04:11 PM IST
Rss principles caused gandhi assassination

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయం సాధించి జాతీయ స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ మోదీ మీద విమర్శలు గుప్పించారు.

చాయావాలా ఇమేజ్ తో దేశమంతా తిరుగుతున్న చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని విమర్శిస్తూ, చాయ్ వాలాలను గౌరవించండి కానీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళని కాదంటూ రాహుల్ బర్దోలీలో ర్యాలీలో మాట్లాడుతూ మోదీ మీద విమర్శాస్త్రాన్ని సంధించారు. 

చాలా చిన్న స్థాయిలో జీవితాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ రైళ్ళల్లో టీ కప్పులు ఇచ్చి జీవనాన్ని సాగించారు చిన్నప్పుడు.  ఆ విషయం బయటకు రావటంతో దాన్ని తన మీద విమర్శగా మారకుండా తనకి అనుకూలంగా మార్చుకున్న మోదీ ఔను నేను చాయ్ వాలానే అంటూ ఆమ్ ఆద్మీ శైలిలో చిన్న వ్యాపారుల మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఆ ప్రయత్నానికి అడ్డు తగులుతూ రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, జీవితంలో ప్రతివారూ ఏదో ఒక వ్యాపకం చేసుకుంటారని, అందులో టాక్సీ నడిపేవాళ్ళూ, వ్యవసాయం చేసేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఉంటారు చాయ్ వాలాలు కూడా ఉంటారని, అందరికీ గౌరవం ఇవ్వాలి కానీ మిమ్మల్ని మోసగించేవాళ్ళకి మాత్రం కాదని రాహల్ గాంధీ అన్నారు.

సర్దార్ పటేల్ మీద భాజపా హక్కుని కూడా కొట్టిపారేసారు రాహుల్ గాంధీ.  బ్రిటిష్ రాజ్ లో సర్దార్ పటేల్ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని అక్కడ చేపట్టటంతో బర్దోలీ ఆ విధంగా ప్రాముఖ్యత వహించింది.  నర్మదా నదిలో ప్రపంచంలోనే ఎత్తైన ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణానికి పూనుకున్న నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, గుజరాత్ లోని రాజకీయ నాయకులు చరిత్ర చదివినట్టుగా లేరు అన్నారు.  సర్దార్ పటేల్ మీద సత్యాలను వక్రీకరించి చెప్తున్నారని రాహుల్ అన్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని బహిష్కరించమని అన్నందుకే మహాత్మా గాంధీ హత్య జరిగిందన్నారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles