Rbi plans to introduce plastic currency

RBI plans to introduce plastic currency, Rs 10 plastic currency in 2014, 1 billion Rs 10, plastic notes to check counterfeits

RBI plans to introduce plastic currency, Rs.10 plastic currency in 2014

త్వరలో రాబోతున్న రూ.10 ప్లాస్టిక్ నోట్లు

Posted: 02/08/2014 02:57 PM IST
Rbi plans to introduce plastic currency

ఎండలు పెరిగిపోయి చేతులకు చెమట పట్టి నోట్లకి తడి అయ్యే సమయం వచ్చేసరికి ప్లాస్టిక్ నోట్లు వచ్చే అవకాశం కనపడుతోంది.

ఆర్థిక రాష్ట్ర మంత్రి నమో నారాయణ మీనా శుక్రవారం లోక్ సభలో త్వరలో రానున్న ప్లాస్టిక్ నోట్ల గురించి మాట్లాడుతూ, ముందుగా సాధ్యాసాధ్యాలను పరీక్షించే నిమిత్తం రూ.10 నోట్లను 2014 రెండవ అర్ధభాగంలో ఒక బిలియన్ నోట్లను విడుదల చేస్తామని అన్నారు.  ఇది ముందుగా కోచి, మైసూర్, జయ్ పూర్, సిమ్లా, భువనేశ్వర్ ఐదు నగరాల్లో జరుగుతుందని ఆయన అన్నారు.  బ్యాంక్ లో పెట్టటానికి, లెక్క పెట్టటానికి, ఎటిఎమ్ ల ద్వారా వితరణ చెయ్యటంలో ఉన్న కష్టనష్టాలను, సౌకర్యాన్ని పరిశీలించిన మీదట ఇది మిగిలిన కరెన్సీ నోట్ల విషయంలో కూడా వర్తింపజేసేట్టుగా, దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా వితరణ చెయ్యవచ్చని భావిస్తున్నారు. 

ఈ ప్లాస్టిక్ నోట్ల వలన నకిలీ నోట్ల వ్యవహారానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది.  ఆ విధంగా దేశంలోకి వస్తున్న నకిలీ నోట్లకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

అంతేకాకుండా నోట్లు చెడిపోకుండా కూడా ఉంటాయి.  ఉదాహరణకు జేబులో నోట్లు పెట్టుకుని ఆ షర్ట్ ని పొరపాటున జేబులో ఉంచేసి వాషింగ్ మషీనం లో వేసి ఉతికినా నోట్ల చెడిపోకుండా ఉండాలన్న లక్ష్యంతో తయారు చేస్తున్న ఈ నోట్లు జూన్ జూలై నెలలవరకు ఐదు నగరాల్లో బ్యాంక్ ల ద్వారా పంపిణీ చెయ్యటం జరుగుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles