Defense budget exhausted says ak antony

Defense budget exhausted says AK Antony, Defense Minister AK Antony, Indigenous products in Defense, Defexpo 2014, Delhi Pragati Maidan

Defense budget exausted says AK Antony

రక్షణ మంత్రి ఆంటోనీ బీదరుపులు

Posted: 02/07/2014 11:50 AM IST
Defense budget exhausted says ak antony

ఢిల్లీ ప్రగతి మైదాన్ లో డిఫెక్స్ పో 2014 ని ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రక్షణ శాఖకిచ్చిన నిధులలో 92 శాతం ఖర్చుచేసామని, ఇక పెద్ద పెద్ద ఖర్చులను వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వాయిదా వెయ్యాలని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ అన్నారు. 

సేనా విభాగంలో వాడుతున్న పరికరాలన్నీ సాంకేతికంగా పాతవైపోయాయి.  దానితో రక్షణ శాఖ ఇబ్బందులను ఎదుర్కుంటోంది.  అయితే నిధులన్నీ ఖర్చైపోయాయని, ఈ నేపథ్యంలో కొత్త వస్తువుల కొనుగోలు సాధ్యం కాదని అన్నారు ఆంటోనీ. 

ప్రస్తుతం ఆర్థికమైన వెసులుబాటు తక్కువగా ఉన్నా, అంతకు ముందు కూడా కొనుగోళ్ళ విషయంలో విమర్శలను ఎదుర్కుంటూ, జాప్యం కూడా కలగటం విషయంలో మాట్లాడుతూ, అవినీతి చోటుచేసుకోకుండా ఉండటం కోసం తీసుకున్న జాగ్రత్తల వలన ఆలస్యం జరిగినమాట వాస్తవమే కానీ దాని వలన వ్యవస్థలో క్రమబద్ధీకరణ కూడా వచ్చిందన్నారాయన.  అయితే ఎక్కడా ఏ విషయంలోనూ నియమ ఉల్లంఘనలను ఉపేక్షించబోమని, పారదర్శకతకు పెద్దపీట వేస్తామని ఆంటోనీ అన్నారు. 

డిఫెక్స్ పో లో మాట్లాడుతున్నంత సేపూ ఆంటోనీ భారతీయ ఉత్పాదనలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మాట్లాడారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles