Attempt to murder bjp leader foiled

Attempt to murder bjp leader foiled, Manipur Rifles, BJP Prime Ministerial candidate Modi, Narendra Modi, Imphal West districts

Attempt to murder bjp leader foiled

మోదీ సభలో హత్యాప్రయత్నం- భగ్నం చేసిన పోలీసులు

Posted: 02/07/2014 12:33 PM IST
Attempt to murder bjp leader foiled

శనివారం మణిపూర్ లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ర్యాలీ జరగబోతున్న సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  

రాత్రి 11.30 ప్రాంతంలో పూర్వీ ఇంఫాల్ లో అనుమానస్పదంగా సంచరిస్తూ కనిపించిన ముగ్గురు వ్యక్తులను ముందుగా సవమ్బంగ్ స్థానికులే గుర్తించి వాళ్ళని నిర్బంధించేందుకు ప్రయత్నించగా ముగ్గురిలో ఇద్దరు పట్టబడ్డారు, ఒకతను పారిపోయాడు.  వాళ్ళు మణిపూర్ రైఫిల్స్ కి చెందిన వ్యక్తులని దర్యాప్తులో తేలింది.  

భాజపా నాయకుడిని హత్య చేసేందుకు వాళ్ళు ముగ్గురూ పథకాలు వేస్తూ పట్టుబడ్డారని వాళ్ళని ప్రశ్నించిన సమయంలో పోలీసులు తెలుసుకున్నారు.  వాళ్ళ దగ్గర లభించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నరేంద్ర మోదీ ర్యాలీ పశ్చిమ ఇంఫాల్ లో ల్యాంగింగ్ అచౌబా లో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.  ఈ సందర్భంగా అప్రమత్తంగా మెలగటంతో అక్కడి భాజపా నాయకుని మీద వాళ్ళు చేసిన హత్యాప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు పడింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles