Another twist on t bill

t bill on parliament, telangana issue, telangana twist, president, vote on account, telangana draft bill, vote on account budjet

another twist on t bill

టి బిల్లులో మరో ట్విస్ట్ట్

Posted: 01/16/2014 07:11 AM IST
Another twist on t bill

 

 

 

తెలంగాణ ఏర్పాటు విషయంలో  రాఫ్ర్ట అసెంబ్లీ కోరిన పక్షంలో బిల్లును తిరిగి పంపండానికి  శాసనసభకు  ఇచ్చిన గడువును  మరో 10 రోజులు రాష్రపతి పొడిగించవచ్చని  అధికార వర్గాలు చూచాయిగా వెల్లడిస్తున్నాయి. గతంలో ఛత్తీస్ ఘడ్ ఎర్పాటు సందర్భంలోనూ  అక్కడ సంప్రదింపుల నిమిత్తం   రాష్ర్టపతి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ దరిమిలా  ఇక్కడకూడా ఇదే సూత్రాన్ని అనుసరించవచ్చని  తెలుస్తోంది. ముందుగా  విభజన బిల్లును అసెంబ్లీకి పంపిస్తూ.. దీనిపై చర్చకు ఆరువారాల గడువిచ్చి జనవరి 27లోగా కేంద్రానికి పంపాలని  రాష్ర్టపతి కోరిన విషయం తెలసిందే. అయితే అసెంబ్లీలో  జరుగుతున్న పరిణామాలు, తీవ్రవాదోపవాదాలు, సభ్యుల ఆందోళనల మధ్య బిల్లుపై చర్చ ఏ మాత్రం ముందుకు సాగలేదు.

ఈ నేపధ్యంలో రాష్రపతి గడువు పొడిగించ  వచ్చని తెలుస్తోంది. అయితే దీనివలన కేంద్రానికి  బిల్లు పాస్ చేసేందుకు తగిన సమయం  లభించక పోవచ్చు. దీనిపై ఫిబ్రవరి రెండోవారంలో  వోట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ కోసం పార్లమెంటు సమావేశం కానుంది. అప్పుడు  తెలంగాణ ప్రస్తావన రావచ్చు. అయితే అప్పుడు జగిగే 10 రోజుల పార్లమెంటు పని దినాల అజెండా ఇంకా ఖరారు కాలేదని  తెలుస్తోంది. అయతే ఈ నేపధ్యంలో అసెంబ్లీ అభిప్రాయంతో  సంబంధం లేకుండానే పార్లమెంటు విభజన ప్రక్రియను పూర్త చేయవచ్చనే వాదన వినిపిస్తోంది.  అదే జరిగితే మరోసారి  ఆందోళనలు చెలరేగే అవకాశముందని  రాజకీయవర్గాలు  అంటున్నాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles