Free water supply to hyderabad

free water supply, aam adimi party, hyderabad water board, free water supply posible or not, hyderabad water board expences

free water supply is it to possible to hyderabad

ప్రీ వాటర్ పై వార్

Posted: 01/16/2014 08:04 AM IST
Free water supply to hyderabad

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ఉచిత నీటి సరఫరాను మొదలు పెట్టిందో లేదో ఇంతలోనే దేశంలోని మిగతా రాష్రాలు సైతం తమకూ ఉచితంగా నీటిని  అందించాలని గగ్గోలు పెడుతున్నాయి. ఢి్ల్లీలో అక్కడి ప్రభుత్వం ఉచితంగా నీటిని ఇవ్వగలిగి నప్పుడు మీరెందుకు  ఇవ్వలేరని స్థానిక నాయకులను నిలదీస్తున్నారు. దీంతో అన్ని రాష్ర్లాల్లోనూ ఉచితంగా నీటిని అందించేందుకు గల సాధ్యసాధ్యాలపై  విపరీతమైన చర్చలు సాగుతున్నాయి.

ఆమ్ ఆద్మీ తీసుకొచ్చిన  ఈ విప్లవం ఇప్పుడు వాడవాడలా పాకిపోయింది.. దీంతో మన హైదరాబాద్ జలమండలి అధికారులూ  చేసేదేమీలేక     ఢీల్లీ వెళ్లి అక్కడి పరిస్థతులను అధ్యయనం చేయడంతో పాటు పలు సూచనలు తీసుకున్నారు. అనంతరం ఇక్కడ ఉచితంగా నీటిని అందిస్తే ఎంత ఖర్చవుతుంది? సాధ్యా సాధ్యాలేమిటన్న దానిపై కూలంకషంగా  చర్చలు చేస్తున్నారు. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన  జలమండలికి అది సాధ్యం కాకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.     ప్రస్తుతం నగరంలో 8 లక్షల నల్లా కనెక్షన్లుంటే, వాటిలో 2 లక్షలు పేదలకు చెందినవి.  రోజుకు 340 గ్యాలన్ల నీరు నగరానికి అవసరమవుతుండగా,  అతికష్టం మీద సరఫరా చేస్తున్నారు. 

నల్లా కనెక్షన్ ఉన్న ప్రతీ పేద కుటుంబం నుంచి నెలకు 200 వసూలు చేస్తున్నారు. వీరందరికీ  ఉచితంగా నీరు అందివ్వాలంటే నెలకు 180 నుండి 200 కోట్ల భారం పడుతుంది. అదీగాక ఇప్పటికే జలమండలికి అనేక అప్పులున్నాయి. జలమండలికి నెలకు 61 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా ఖర్చు 91 కోట్ల రూపాయలను  దాటిపోతోంది. పైగా పెద్ద పెద్ద సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు  ఏళ్ల తరబడి నీటి బకాయిలను చెల్లించడమే లేదు.     ఈ విధంగా జలమండలికి ఇప్పటికిప్పుడు రావలిన ఆదాయం 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు జలమండలి నెలకు     50 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలను చెల్లిస్తోంది. పైగా ఎప్పుడో నిజాం కాలంలో వేసిన పైపులైన్లు పగిలిపోతూ సంస్థకు మరిన్న నష్టాలను కలిగస్తున్నాయి. ఈ నేపధ్యంలో భగ్యనగరానికి  ఉచిత మంచినీటి  సరఫరా హుళ్లక్కే అన్నట్లుంది.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles