Budjet canteens in tamila nadu

idli, smber, curd rice cheep price, tamilanadu state, curd rice are sold for Rs. 3, idl is one rupee

Budget canteens extended across Tamil Nadu state

అమ్మ క్యాంటీన్ కు భలే గిరాకీ

Posted: 01/15/2014 05:32 PM IST
Budjet canteens in tamila nadu

 

 

 

ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో రూపాయికి  ఇఢ్లీ, మూడు రూపాయలకు  పెరుగన్నం  తమిళనాడులో లభ్యమవుతోంది. హైదరాబాద్ లో కనీసం ప్లేటు ఇడ్లీ 15 నుంచి 20 రూపాయలు  ఉండగా, కేవలం పెరుగన్న 30 రూపాయలు  ఉంటోంది. ఈ విధంగా  రూపాయికి  ఇడ్లీ, మూడు రూపాలకు పెరుగన్నం  వడ్డిస్తున్న ఘనత తమిళనాడు ముఖ్యమం త్రి జయలలికతే దక్కుతుంది.

నిత్యాసర ధరలు అనునిత్యం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో తమిళనాడులో జయలలిత ప్రారంభించిన  ఈ పథకానికి అనేక ప్రసంశలు అందడంతో పాటు పేదవాడి కడుపు నిండుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లకు  ఆ రాష్రంలో అత్యధిక ఆదరణ లభిస్తోంది.. నిజానికి చెన్నయ్ లాంటి మహానగరాల్లో  తినుబండాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి  జయలలిత తీసుకున్న  ఈ నిర్ణయాన్ని  పలువురు మెచ్చుకుంటున్నారు.  అలేగే సంపాదన అంతంత మాత్రంగా ఉండే సామాన్యుడు కడుపునిండా తినగలుగు తున్నాడు. ముందుగా  ఈ క్యాంటీన్లలో ఇడ్లీలనే విక్రయించేవారు. తరువాత మూడు రూపాయలకు  సాంబారు అన్నం, పెరుగన్నం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చెన్నయ్ మహానగరంలో  ప్రారంభమైన  క్యాంటీన్లను  అనంతరం మదురై , కోవై, ఈరోడ్ తదితర ప్రాంతాల్లో నెలకొల్పారు. ఈ క్యాంటీన్ల నిర్వహణకు  ప్రభుత్వమే సహాయ సహకారాలు అందిస్తుంది. వీటికి నాణ్యమైన సరుకులను పంపిచడంతో పాటు తగిన ఏర్పాట్లను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. అలాగే వీటిని మహిళా గ్రూపులకు కేటాయించారు.. ఏది ఏమైనప్పటికీ  మన రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఇటువంటి క్యాంటీన్ల ఏర్పాటుకు  చర్యలు తీసుకుంటే బాగుంటుందని  పలువురు అంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles