Housewife better than chidambaram says chandrababu

Housewife better than Chidambaram says Chandrababu, Chandrababu Naidu, TDP, Rising prices in India, Dwkra loans

Housewife better than Chidambaram says Chandrababu

ఇల్లు చక్కదిద్దే ఇల్లాలే నయం చిదంబరం కన్నా-చంద్రబాబు

Posted: 01/11/2014 08:44 AM IST
Housewife better than chidambaram says chandrababu

ఆర్ధిక మంత్రి చిదంబరం కన్నా తెలుగింటి ఆడపడచులే సమర్ధవంతులని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. 

తెలుగుదేశం పాలనలో ధరలు నియంత్రణలో ఉంచితే కాంగ్రెస్ వచ్చి ధరలను ఆకాశాన్నంటేట్టుగా చేసిందని, అయినా మన మహిళలు మూడు నాలుగు వేల రూపాయలతో ఎంతో జాగ్రత్తగా ఇల్లు గడుపుకొస్తున్నారంటే అది వారి చాకచక్యం, అంకితభావమేనని, ఆ మాత్రం ముందు చూపు దేశ ఆర్ధిక మంత్రి చిదంబరానికి లేకపోయిందని అన్నారాయన. 

ధరలను తగ్గిస్తామంటూ ప్రజలను నమ్మించి సోనియా గాంధీ అధికారాన్ని చేపట్టి పది సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తున్నారని, ఎన్నికలలో మాత్రం వోటర్లను డబ్బులతో ఎరవేస్తుంటారని, అటువంటి పార్టీలను గెలిపించవద్దని చంద్రబాబు నాయుడు.

డ్వాక్రా ఋణాలను రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేయటానికి వరంగల్ కర్నూల్ జిల్లాల నుంచి వచ్చిన మహిళలను సంబోధిస్తూ తెదేపాను ఆదరించాలని, ఇతర అవినీతి పార్టీలను ఓడించాలని ఆయన కోరారు.  చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన అనుభవంలో తన తల్లి వంట చేసేటప్పుడు కళ్ళల్లో నీరు రావటం తాను చూసానని, ఏ మహిళకైనా అటువంటి దుస్థితి కలుగకూడదనే ఉద్దేశ్యంతో తాను అధికారంలోకి రావటంతోనే 32 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించానని, ఈ పని ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ చెయ్యలేదని ఆయన అన్నారు.  అంతేకాదు తన ప్రభుత్వంలో ఆ తొమ్మిది సంవత్సరాలూ ఒక రూపాయి కూడా గ్యాస్ ధరను పెంచలేదని గుర్తుచేసారు చంద్రబాబు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles