Tit for tat to us by india

Tit for tat to US by India, Devyani Khobragadi, Sangita Richard, Diplomat immunity to Devyani, Visa fraud case on Devyani

Tit for tat to US by India

దేవయాని ఖోబ్రాగడె స్వదేశానికి

Posted: 01/11/2014 09:10 AM IST
Tit for tat to us by india

దేవయాని ఖోబ్రాగడె దౌత్త వేత్తలకుండే సంపూర్ణమైన చట్టపరమైన రక్షణతో శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. 

అయితే దానికి ముందే భారతదేశం ఖోబ్రాగడె స్థాయిలో భారతదేశంలో పని చేస్తున్న అమెరికా దేశ దౌత్యాధికారిని భారత దేశం నుంచి పంపించేయమని భారత్ అమెరికాని కోరింది.  అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ దేవయానిని భారతదేశం వెళ్ళిపోమని చెప్పటం వలనే భారత ప్రభుత్వం అందుకు ప్రతిగా భారతదేశం నుండి అమెరికన్ దౌత్తవేత్తను దేశం వదిలిపెట్టమని అడగటం జరిగింది.

దేవయాని మీద కేసుని విచారించటానికి సిద్ధమైన రోజునే ఆమెను ఫుల్ ఇమ్యూనిటీతో అమెరికా నుంచి పంపించేయటం విశేషం. 

దేవయాని ఖోబ్రాగడె మీద ఆమె తన ఇంట్లో పనిచేసే సంగీతా రిచర్డ్ వీసా విషయంలో తప్పు సమాచారమిచ్చారని, ఆమెకు జీతభత్యాల విషయంలో ఇవ్వటానికి అంగీకరించిన సొమ్ము ఇవ్వలేదన్న అభియోగం మీద ఆమెను అరెస్ట్ చేసి చిల్లర నేరగాళ్ళ మధ్య జైలులో పెట్టటం వివస్త్రతనిఖీ నిర్వహించటం పట్ల భారత దేశమంతా అట్టుడికిపోయింది.  అందుకు భారత ప్రభుత్వం కూడా స్పందించి అమెరికాతో రాజీపడకుండా దేవయానిని క్షేమంగా దేశానికి తరలిరావటంలో తోడ్పడింది.

-శ్రీజ


దీనికి సంబంధించిన ఆర్టికల్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles