Chandrayan 2 to start at isro

Chandrayan 2 to start at ISRO, Space Secy Radhakrishnan, Chandrayan, Chandrayan 2, moon rover from ISRO

Chandrayan 2 to start at ISRO

ఇస్రో నుంచి చంద్రయాన్ – 2 కి తయారీలు

Posted: 01/10/2014 06:32 PM IST
Chandrayan 2 to start at isro

చంద్రయాన్ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళటంతో కలిగిన ప్రోత్సాహంతో ఇస్రో చంద్రయాన్-2 కి వ్యూహరచన చేస్తోంది.  

స్పేస్ సెక్రటరీ కె రాధాకృష్ణన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రయాన్ 2 లో చంద్రుడి మీది దిగి అక్కడ పరిశోధనలు నిర్వహించటానికి 2016-2017 లలో భారతదేశంలో తయారైన రోవర్ ని జిఎస్ఎల్వి సాయంతో పంపించటం జరుగుతుందని అన్నారు.  

అక్టోబర్ 22, 2008 లో శ్రీహరికోట నుండి లాంచ్ చేసిన చంద్రయాన్ చంద్రుడికి 100 కి.మీ దూరంలో చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉపగ్రహంలోని రసాయన ఖనిజాల గురించి ఫొటో జియాలాజికల్ మ్యాపింగ్ చేస్తోందని, 2012లో సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చెయ్యటం జరిగిందని రాధాకృష్ణన్ అన్నారు.  

చంద్రుడి మీద ల్యాండ్ చెయ్యటానికి అవసరమైన సాంకేతిక విధానాన్ని కూడా అభివృద్ధి చేయవలసి ఉంటుందని, అంతే కాకుండా ఎక్కడ దిగాలన్నదాని విషయంలో నిర్ణయం తీసుకోవటానికి చంద్రుడి మీద వివిధ ప్రాంతాల్లో ఫొటోలు సేకరించవలసివుంటుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles