Akkineni nageswara rao is well

Akkineni Nageswara Rao is Well, Akkineni Nagarjuna, Akkineni Akhil, Sumanth, Akkineni Cancer treatment

Akkineni Nageswara Rao is Well

అక్కినేని ఆరోగ్యంగానే ఉన్నారట!

Posted: 01/08/2014 03:53 PM IST
Akkineni nageswara rao is well

అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు.  కేన్సర్ ఆపరేషన్ అయిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని, మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతోందని మీడియాలో వచ్చిన వార్తలు కేవలం వదంతులేనంటూ ముందు ఆయన మనుమడు సుమంత్, తర్వాత ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున కూడా ట్విట్టర్లలో ప్రకటనలు చేసారు.

నాన్నగారు బాగున్నారు, అభిమానులెవరూ ఆ వార్తలను నమ్మవద్దు, ఈ మధ్యనే మనం సినిమాకి డబ్బింగ్ స్వయంగా చెప్పారు అంటూ అక్కినేని నాగార్జున అన్నారు.  ప్రేమాభిమానాలు చూపిస్తున్నవారందరికీ కృతజ్ఞతలంటూ సుమంత్ సంతోషాన్ని వెలిబుచ్చారు.

అక్కినేని నాగేశ్వరరావు మనుమడు, నాగార్జున తనయుడు అఖిల్ కూడా తాతగారు చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చలాకీగా తన పనులు చేసుకుంటున్నారు, అస్వస్థతకు గురవటం అబద్ధం, హాయిగా పాత సినిమాలు చూస్తూ గడుపుతున్నారంటూ చెప్పారు. 

అక్కినేని కుటుంబ సభ్యులపట్ల అభిమానులందరికీ హాయిగా ఊపిరి పీల్చుకునే వార్త ఇది

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles