Security denied by kejriwal

security denied by kejriwal, Aam Admi Party, Delhi Chief Minister, Hindu Raksha Dal, Vandalism at AAP Office

security denied by kejriwal

ఆప్ తమకు సెక్యూరిటీ వద్దని తప్పు చేసారా ?

Posted: 01/08/2014 03:27 PM IST
Security denied by kejriwal

విఐపి సంస్కృతికి తెరదించాలనే ప్రయత్నంలో భాగంగా కారు మీద ఎర్రబుగ్గలు, ట్రాఫిక్ లో ఎర్రలైట్ వచ్చినప్పుడు ఆగిపోవటం, ప్రభుత్వం ఇచ్చే బంగళాలు వద్దనటం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్నారు బాగానేవుంది కానీ దాని గురించి మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి పరిస్థితులు. 

మొన్న అమేథీలో శృంగభంగం, చావుతప్పి కన్నులొట్టపోయినట్లు వేదిక నుంచి పారిపోయిన ఆప్ పార్టీ సభ్యుల ఘటన మర్చి పోకముందే ఈ రోజు ఏకంగా ఢిల్లీ సమీపంలో యుపి సరిహద్దు నగరమైన ఘాజియాబాద్ లోని ఆప్ కార్యాలయం మీద జెండాలు చేత పట్టుకుని జమ్ము కాశ్మీర్ నుంచి వచ్చిన హిందూ రక్షా దళ్ రైట్ వింగ్ కార్యకర్తలు దాడి చేసారు.  40 మంది వరకు ఉన్న ఆందోళనకారులు కార్యాలయానికి చెందిన ఫర్నిచర్, ఆస్తులను ధ్వంసం చేసారు. 

ఉన్నట్టుండి ఆ గుంపంతా కార్యాలయం మీదకు విరుచుకుపడటం చూసి ఆప్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది లోపల తలుపులు వేసుకుని ఉండగా దుండగులు బయట ఉన్న వస్తువులను విరగకొట్టారు.  దాదాపు 20 నిమిషాలు సాగిన ఈ కాండ ఆప్ కార్యాలయంలో ఉన్న వాలంటీర్లను భయభ్రాంతులను చేసింది.

ఔను ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా మేమే ఆ పని చేసామని హిందూ రక్షా దళ్ లోని సీనియర్ నాయకుడు మీడియాలో మాట్లాడుతూ చెప్పారు. 

సిసి కేమెరాల సాయంతో దుండగులను గుర్తించటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.  ఇలాంటి సంఘటనల వలన కేజ్రీవాల్ కి భద్రత అవసరం అనే అవకాశం ఉంది.  ఆ మాట కేజ్రీవాల్ అనకపోయినా ఆయన పార్టీలోని నాయకులు బలవంతంగానైనా భద్రతా ఏర్పాటు చేయిస్తారు. 

నా చేతిలో జీవన రేఖ చాలా పెద్దది చూడండి అన్నారామధ్య కేజ్రీవాల్.  కానీ ఉగ్రవాదులకు కూడా అవకాశం ఇచ్చినట్లవుతుంది.  నిజంగా సామాన్య మానవుడి అపహరణ జరిగితే ఎవరూ దానికి స్పందించరు కానీ పెద్ద నాయకులకు ఏం జరిగినా దాన్ని ఉగ్రవాదులు తమ విజయం గా భావిస్తారు.  భద్రత వద్దనటం వలన అటువంటి వాటికి అవకాశం ఏర్పడుతుంది.  ట్రాఫిక్ లో చిక్కుకుంటే మరీ ప్రమాదం. 

అందువలన నాయకులకు భద్రత, ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళని పోనివ్వటం వాళ్ళు తీసుకున్న బాధ్యతల దృష్ట్యా అవసరం.  అయితే వాటిని వృధా చెయ్యకుండా ఉన్నంతకాలం అటువంటి ఏర్పాట్లు చేసుకోవటం తప్పేమీ కాదని కేజ్రీవాల్ కి అర్థమౌతుందని రాజకీయాలలో ప్రవేశమున్నవాళ్ళు భావిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles