Debate started on telangana bill in ap assembly

Telangana Bill debate begins in AP Assembly amid protests, Debate begins on Telangana Bill, Debate on Telangana Bill started

AP Reorganisation Bill-2013 in Andhra Pradesh Legislative Assembly this afternoon.

టి. బిల్లు పై చర్చ మొదలైంది... కానీ ?

Posted: 01/08/2014 07:40 PM IST
Debate started on telangana bill in ap assembly

కేంద్రం నుండి అసెంబ్లీలో చర్చించమని గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన సంగతి తెలిసిందే. బిల్లు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రోజు రచ్చ రచ్చ చేస్తూ సభను, సభా సమయాన్ని వ్రుధా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ బిల్లు పై చర్చ ప్రారంభం కావాల్సి ఉండగా రోజు సభను వాయిదా వేస్తూ పోతున్నారు స్పీకర్.

ఎట్టకేలకు నేడు తెలంగాణ ముసాయిదా బిల్లు పై చర్చ ప్రారంభించారు. మరి ఇప్పుడైనా సభ సజావుగా సాగుతుందా ? అంటే అదీ లేదు. ఓ వైపు తెలంగాణ పై మంత్రి వట్టి వసంత కుమార్ మాట్లాడుతుండగానే వైకాపా ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. బిల్లు పై చర్చను ప్రారంభించిన మంత్రి వట్టి వసంత కుమార్ చర్చకు అవకాశం ఇచ్చిన సభకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వట్టి వసంతకుమార్ చెప్పారు.  ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వట్టి అన్నారు. విభజనతో ఆర్థికంగా, నదీజలాల సంక్షేమం విషయంలో లెక్కలేనంత నష్టం వాటిల్లుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలు దీనిని ఆమోదించరని చెప్పారు. విభజనతో సీమాంధ్రకు మరింత నష్టమన్నారు.

బుధవారం మధ్యాహ్నం శాసన సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్చను ప్రారంభింప చేయాలని సభాపతిని కోరారు. స్పీకర్ సూచించడంతో వట్టి బిల్లు పైన చర్చను ప్రారంభించారు. సభ్యులు అడిగిన సమాచారం ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులో ఉంచుతామని ఆనం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles