Ashok babu as apngo president for 3 years

Ashok Babu as APNGO President, APNGO Association Elections, Ashok Babu elected APNGO President, APNGO Association polls 17 positions

Ashok Babu as APNGO President For 3 years

ఏపిఎన్జీవోల సంఘానికి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా అశోక్ బాబు

Posted: 01/06/2014 10:11 AM IST
Ashok babu as apngo president for 3 years

ఆదివారం నాడు జరిగిన ఏపిఎన్జీవోల ఎన్నికలలో అత్యధిక మెజర్టీతో విజయం సాధించటంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండే అశోక్ బాబు పూర్తిస్తాయి అధ్యక్షుడయ్యారు.  ఆయనకు లభించిన ఈ పదవి మూడేళ్ళ కాలపరిమితి వరకు ఉంటుంది. 

పోలింగ్ లో మొత్తం వోట్లు 847లో 835 మంది పోలింగ్ లో పాల్గొన్నారు.   అందులో అశోక్ బాబు పక్షంలో 630 రాగా ఆయనకు పోటీగా నిలిచిన బషీర్ కి 174 వోట్లు లభించాయి.  ఒక వోటు చెల్లలేదు. 

అధ్యక్షుడు, సహాయ అధ్యక్షడు, ప్రధాన కార్యదర్శి, నిర్వహణ కార్యదర్శి, కోశాధికారి, ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, నాలుగురు కార్యదర్శులు మొత్తం 17 స్థానాలకు జరిగిన ఏపిఎన్జీవో సంఘం ఎన్నికలలో ఉదయం 9 గంటల నుంచి వోటర్లు అమితోత్సాహంతో పోలింగ్ లో పాల్గొన్నారు. 

వోట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ లోనూ అశోక్ బాబు ఆధిక్యత ఉద్యోగులలో సంతోషాతిశయాన్ని రేపింది.  బాణా సంచాలను కాలుస్తూ జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles