No consensus in bac meeting

No consensus in BAC meeting, Speaker Nadendla Manohar, BAc of Council, MIM party, YSRCP, Telangana MLCs protests

No consensus in BAC meeting

బిఏసి లో కుదరని ఏకాభిప్రాయం, చర్చకు అది అడ్డు కాదన్న సభాపతి

Posted: 01/06/2014 01:53 PM IST
No consensus in bac meeting

శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలవుతూనే ఎప్పటిలాగానే ఆందోళనల మధ్య వాయిదాల బాట పట్టాయి. 

బిఏసి సమావేశం తర్వాత శాసన సభ సమావేశాలుంటాయని సభాపతి వెల్లడించారు.  అందుకనుగుణంగానే ఉదయం పది గంటలకు ప్రారంభమైన బిఏసి సమావేసాలలో ఏకాభిప్రాయం కుదురలేదు.  తిరిగి రెండు గంటలకు మరోసారి బిఏసి సమావేశమవుతోంది.  ఈ నేపథ్యంలో ఎమ్ఐఎమ్ నాయకుడు అక్బరుద్దీన్ సభాపతిని, ఇంతకీ తెలంగాణా బిల్లు మీద చర్చ మొదలైనట్టా కాదా అని ప్రశ్నించగా, ఈ వివాదాన్ని పక్కన పెట్టి చర్చ కొనసాగిద్దామని సభాపతి నాదెండ్ల మనోహర్ అనటంతో సీమాంధ్ర నాయకుల నుండి వ్యతిరేకతలు వెల్లువెత్తాయి. 

ముందు సమైక్యాంధ్ర తీర్మానం చేసిన తర్వాతనే బిల్లు మీద చర్చ జరగాలని వైకాపా పట్టుపట్టటంతో, గతంలో తీర్మానానికి పట్టుబట్టినప్పుడు శాసన సభ్యులను సస్పెండ్ చేసిన విధంగానే ఇప్పుడూ ఆ పని చేసి సభలో చర్చను ప్రారంభించాలని తెరాస కోరింది. 

శాసనమండలి లోకూడా బిఏసి సమావేశం ప్రారంభమవగా తెలంగాణా ఎమ్మెల్సీలు మండలి ప్రధాన ద్వారం దగ్గర ఆందోళన చేపట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles