Assembly sessions started

Assembly sessions started, Telangana Bill, Debate on Telangana bill, TDP, YSRCP

Assembly sessions started

రాష్ట్ర శాసన సభలో ఈ రోజు

Posted: 01/06/2014 09:20 AM IST
Assembly sessions started

ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన శాసన సభలో యథావిధిగా విపక్షాలు వాయిదా తీర్మానాలను చెయ్యగా సభాపతి నాదెండ్ల మనోహర్ వాటిని తిరస్కరించారు.  ఇరు ప్రాంతాలకు చెందిన శాసన సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర గుమికూడి తమతమ ప్రాంతీయ నినాదాలతో ఆందోళన చేస్తూ సభను హోరెత్తించారు. 

తెలంగాణా సీమాంధ్ర ప్రాంతాలలో జరిగిన ఉద్యమాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మీద సమగ్రమైన చర్చ జరగాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సమైక్య తీర్మానం చెయ్యాలని వైకాపా కోరారు.

తెలంగాణా బిల్లు మీద చర్చకు సానుకూలమైన పరిస్థితి కలుగకుండా పదేపదే శాసన సభను అడ్డుకుంటూ వస్తుండటం వలన ఈ రోజు సభాపతి ఫ్లోర్ లీడర్లతో సమావేశానికి సిద్ధమౌతున్నారు.  బిల్లు మీద చర్చ జరగాలని, అప్పుడే దాని మీది వ్యతిరేకతను ప్రకటించటానికి అవకాశముంటుందని కాంగ్రెస్ శాసనసభ్యులు భావిస్తున్నారు.  వాళ్ళు తెదేపా వైకాపా నాయకులకు ఈ విషయంలో నచ్చచెప్పే పనిలో పడ్డారు. 

ఈరోజు బిల్లు మీద చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 

విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించటంతో చెలరేగిన గందరగోళంతో 10.00 గం. వరకు సభ వాయిదా పడింది.  10.00 గంటలకు బిఏసి సమావేశం ప్రారంభమైంది,   బిఏసి తర్వాత శాసనసభ పునప్రారంభమౌతుంది. 

మరిన్ని వివరాలకు ఈ సైట్ కి తిరిగి రండి........

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles