Comedian ali brother khayyum injured in road accident

Ali brother, Khayyum, Accident, Scorpi0 Accident, Tollywood, ali brother, accident, injured, outer ring road, Ali brother Khayyum, shooting, comedian,Khayyum injured

Tollywood comedian Ali brother Khayum was injured in a road accident on Outer Ring Road (ORR) at Koheda mandal of Rangareddy district.

ఔటర్ ప్రమాదంలో ఆలీ తమ్ముడికి గాయాలు

Posted: 12/25/2013 02:18 PM IST
Comedian ali brother khayyum injured in road accident

సినీ నటులకు హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు అస్సలు అచ్చిరావడం లేదు. ఇప్పటి వరకు చాలా మంది సినీ నటులు ఔటర్ రింగురోడ్డు పై ప్రమాదాలకు గరయ్యారు. ఇటీవల మంచు మనోజ్ కారు బొల్తా పడిన సంఘటన మరచిపోక ముందే మరో నటుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రముఖ హాస్య నటుడు ఆలీ సోదరుడు ఖయ్యూం ఈ రోజు ఉదయం ఔటర్ రింగు రోడ్డులో ప్రమాదానికి గురయ్యాడు.

ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇవాళ ఉదయం షూటింగు నిమిత్తం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కోహెడ సమీపంలోని రింగు రోడ్డు పై స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తుండగా ఆయన కారును లారీ ఢీ కొట్టడంతో గాయాలు అయ్యాయి. ఈ సంఘటన తరువాత ఆయన్ను వెంటనే సన్ రైజ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

ఖయ్యూం పలు సినిమాల్లో కమెడియన్‌గా, హీరో స్నేహితుడిగా నటించాడు. ఖయ్యూం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడన్న వార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటనతో ఔటర్ సినీ నటులకు అస్సలు అచ్చిరాదని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles