Kejriwal to be sworn in as delhi cm on dec 28

Arvind Kejriwal sworn Dec 28, CM Arvind Kejriwal, chief minister of Delhi, Arvind Kejriwal,AAP,Najeeb Jung,Delhi Lt Governor

The cabinet ministers to take oath along with Kejriwal are Manish Sisodia, Arvind Kejriwal will take oath as Delhi's seventh chief minister on Dec 28.

ఈనెల 28న ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

Posted: 12/25/2013 04:14 PM IST
Kejriwal to be sworn in as delhi cm on dec 28

ఢిల్లీలో అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీ బీజేపీని చీపురు కట్టతో నోటు లేకుండా సీట్లు సంపాదించి దేశ రాజకీయాల్లోనే సంచలనం స్రుష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి రెడీ అయింది. ప్రభుత్వ ఏర్పాటు చేసేఅంత బలం లేకపోయినా బయట నుండి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని అధికార పీఠాన్ని ఎక్కడానికి రెడీ అయిన కేజ్రీవాల్ ఈనెల 28వ తేదీన ఢిల్లీలో మధ్యాహ్నాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పంపిన ప్రతిపాదనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో కేజ్రీవాల్ సర్కారు ఏర్పాటుచేసేందుకు మార్గం సుగమం అయ్యింది. నిజానికి రేపే ప్రమాణ స్వీకారం చేయాలని కేజ్రీవాల్ అనుకున్నా రాష్ట్రపతి నుండి అనుమతి రాలేదు. నేడు అనుమతి రావడంతో శనివారం అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు.

తొలి సంతకం కరెంటు బిల్లు పైనే చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ తనకు సెక్యురిటీ అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు.  ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తేదీ ఖరారైన తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేను స్వయంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రానని చెప్పిన అన్నా... కేజ్రీవాల్ విన్నపాన్ని మన్నిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles