High tension at ou campus

high tension at OU campus, Students Protest at Osmania University, Tension returns to Osmania University, NCC Gate entrance, Osmania University

high tension at OU campus, Tension returns to Osmania University

పోలీసులపై రాళ్లు రువ్విన ఓయూ విద్యార్థులు

Posted: 12/05/2013 01:39 PM IST
High tension at ou campus

నగరంలో రాయల తెలంగాణ సెగ రగులుతుంది. తెలంగాణ వాదులు, తెలంగాణ విద్యార్థులు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు తెలంగాణ బంద్ లో బాగాంగా ఉస్మానియా విద్యార్థులు పోలీసులపై రాళ్లు వేయటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.రాయలతెలంగాణ ప్రతిపాదనకు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్శిటీ ప్రాంగణంలో ఈరోజు కదం తొక్కారు. అందులోభాగంగా యూనివర్శిటీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఎన్ సీసీ గేట్ వద్ద ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

 

విద్యార్థులు ఆగ్రహంతో ఉగిపోయారు. ఓయూలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతున్న దశలో పోలీసులు రెండు సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ నిన్న కూడా ఉస్మానియా విద్యార్థులు ఓయూలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో వారిని ఎన్ సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో ఓయూలో భారీగా పోలీసులు,భద్రత బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles