T supporters protest akbaruddin owaisi

T-supporters protest akbaruddin owaisi, Akbaruddin Owaisi, telangana bandu, mim party, trs party, rayala telangana,

T-supporters protest akbaruddin owaisi

ఎంఐఎం కు తగిలిన తెలంగాణ సెగ?

Posted: 12/05/2013 11:43 AM IST
T supporters protest akbaruddin owaisi

ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదద్దున్ ఓవైసి రాష్ట్ర విభజన పై అనేక సార్లు ఢిల్లీ పెద్దలతో బేటి అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రధానంగా రెండు డిమాండ్లను ఢిల్లీ పెద్దలకు వినిపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచండి, లేదా రాయల తెలంగాణ కు ఏర్పాటు చేయమని ఎంపీ అసదద్దున్ కోరిన విషయం తెలిసిందే. ఆయన మొదటి నుండి ఈ రెండు డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుతున్నారు. తినగ తినగా వేము తియ్యగా ఉండునట్లు ఎంఐఎం పార్టీ నాయకుడు ఢిల్లీ పెద్దల చెవిలో జోరీగా మాదిరి రాయల తెలంగాణ గురించి నూరిపోసాడు.. దీంతో ..నిన్న వరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నం తీసుకోండని చెప్పిన కేంద్రం .. ఇప్పుడు రాయల తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది.

 

దీంతో తెలంగాణ నాయకులకు, తెలంగాణ ప్రజలక ఒక్కసారిగా ఒళ్లు మండి, రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగాఈరోజు బంద్ కుపిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ నేతలుఎంఐఎం పార్టీ ని కూడా టార్గెట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు చాంద్రాయణగుట్టఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ సెగ తగిలింది. ఆయనను తెలంగాణ వాదులు కొత్తూరు మండలం జేపీ దర్గా వద్ద అడ్డుకున్నారు. అక్బరుద్దీన్ కారుపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

ఇప్పటి వరకు తెలంగాణ నేతలు గానీ, తెలంగాణ ప్రజల గానీ ఎంఐఎం పార్టీ జోలికి గానీ, ఆ పార్టీనాయకులజోలికి గానీ వెళ్లలేదు. ఇదే మొదటిసారి కావటంతో.. నగరంలోని ముస్లిం పెద్దలు చర్చలు జరుపుతున్నారు. రాయల తెలంగాణ కు అనుకూలంగా ఎంఐఎం పార్టీ సపోర్టు ఉందనే ఉద్దేశంతో.. తెలంగాణ వాదులు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడ్డుకోవటం జరిగింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles