సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేస్తున్నా ఎపీ ఎన్జీవో అద్యక్షఉడు అశోక్ బాబు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ దారేది అంటున్నారు. నిన్న లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాస్ నారాయణ్ని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వస్తే ఏం చేస్తారో క్లారిటీగా చెప్పటం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే 294 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని అశోక్ బాబు తెలిపారు. అశోక్ బాబు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.
ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ, ఎంఐఎం. టీఆర్ఎస్ పార్టీలను కలుస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తామన్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ 9 కి.మీ మేర మానహారం నిర్వహిస్తామన్నారు. తమ భవిష్య కార్యాచరణను 9వ తేదీనే ప్రకటించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. గతంలో తాము కలవలేకపోయిన తీయ పార్టీల నేతలను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి కలవనున్నట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరనున్నట్టు అశోక్ బాబు స్పష్టం చేశారు.
అయిన అశోక్ బాబు టీఆర్ఎస్ పార్టీ నేతలను ఏ ఉద్దేశంతో కలుస్తోరో ఎవరికి అర్థం కావటంలేదు. టీఆర్ఎస్ పార్టీ 100 శాతం తెలంగాణ కావాలనే నాయకులు ఎక్కువ, ఆ పార్టీలో ఏ ఒక్కరు కూడా సమైక్యాంద్ర జై అనే నాయకుడే లేడు, అలాంటి పార్టీ నేతల వద్దకు వెళ్లి ఏమని అడుగుతావని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. పాలు పిండే ఆవు వద్ద కొంచెం ఎక్కువ పాలు పిండుకోవచ్చు. అసలు పాలే ఇవ్వని దున్నపోతు వద్ద ఏం పిండుతావు అశోక్ బాబు.
సమైక్యవాదులను ఇంకా నవ్వుల పాలు చేయటం ఎందుకు? సీమాంద్ర నాయకుల్లోనే సమైక్యాంద్ర సౌండ్ లేనిప్పుడు.. మీరు ఎంతమందిని కలిసినా, ఎన్నీ జాతీయ పార్టీల నాయకులను కలిసినా..ఫలితం నిండు సున్నా అని సమైక్యవాదులు అంటున్నారు. అశోక్ బాబు సిద్దాంతాలు ఏమిటో ఎవ్వరికి అర్థం కావటంలేదని సమైక్యవాదులే అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more