Bill on telangana to come soon before parliament says shinde

Telangana Bill come soon, Telangana Bill on Parliament gom,parliament,sushil kumar shinde,telangana

Refusing to confirm whether the Bill to carve out separate Telangana state will be tabled in the winter session of Parliament, beginning this week, Union Home Minister Sushil Kumar Shinde today said the Bill will come very soon before Parliament.

అతి త్వరలో పార్లమెంటుకు టి. బిల్లు

Posted: 12/02/2013 09:10 AM IST
Bill on telangana to come soon before parliament says shinde

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.  తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ విషయంతో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) తన పనిని పూర్తి చేసిందని ఆయన తెలిపారు.

కేంద్ర మంత్రివర్గం బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపుతుందని షిండే తెలిపారు.  తెలంగాణ ముసాయిదా బిల్లు నివేదికను కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తుందని, న్యాయశాఖ ప్రక్రియ పూర్తయిన తరువాత వీలైనంత తొందరగా బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నామని చెప్పారు.

మరో వైపు కేంద్రం రాయల తెలంగాణకే మొగ్గు చూపిందని రాయల తెలంగాణ బిల్లునే ప్రవేశ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరో వైపు బీజేపీ రాయల తెలంలగాణ బిల్లుకు మద్దతు ఇవ్వమని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles