Dy cm raja meets jayram ramesh on r telangana issue

Dy CM Raja meets Jayram ramesh on R-Telangana issue,Damodara Rajanarasimha meets Digvijaya Singh on Telangana issue, Rayala telangana, Deputy Chief Minister C Damodara Rajanarasimha, telangana

Dy CM Raja meets Jayram ramesh on R-Telangana issue

రాయల తెలంగాణపై : డిప్యూటీ సిఎం

Posted: 11/30/2013 05:30 PM IST
Dy cm raja meets jayram ramesh on r telangana issue

 తెలంగాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న సమయంలో.. రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు అందరి చూపు రాయల తెలంగాణ పై ఉందని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. అయితె తెంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో డిప్యూటి సీఎం హూటహూటిన ఢిల్లీకి పరుగులు తీసి .. కాంగ్రెస్ పెద్దలను కలిసే పనిలో బిజగా ఉన్నారు. రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

ఆయన ఈరోజు ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం దామోదర విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. నిన్న, మొన్నటి వరకూ పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిన దామోదర.. తాజగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

 రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని, కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఈ అంశాన్ని తెరమీదుకు తెచ్చినా దామోదర ఖండించకపోవడంతో ఆయన కూడా రాయల తెలంగాణకు మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ .... పోలవరం, భద్రాచలం అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు ఏవిధంగా వస్తుందనే దానిపై చర్చ జరిపినట్లు దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అనంతరం ఆయన ఏకే ఆంటోనీతో సమావేశం అయ్యారు. అయితే కేంద్రం నుండి రోజుకో లీకు, గంటకో బ్రేకుతో రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం చివరకు ఏ స్టాండ్ తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరమే.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles