Mozambique passenger plane carrying 34 goes missing

Mozambique passenger plane carrying 34 goes missing, Mozambican Airlines airplane carrying, 28 passengers, six crew members, Mozambique plane missing with 34 on board

Mozambique passenger plane carrying 34 goes missing

34 మంది ప్రయాణికులతో మాయమైన విమానం

Posted: 11/30/2013 12:35 PM IST
Mozambique passenger plane carrying 34 goes missing

ఒకరు కాదు, ఇద్దరు కాదు ..ఏకంగా 34 మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం కనిపించకుండా మాయమైంది. నిత్యం మనం రోడ్డు మీద అనేక ప్రమాదాలు చూస్తుంటాం, అవి మన కళ్లముందే జరుగుతాయి కాబట్టి ఆ ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే సహయ చర్యలు అందిస్తారు. కానీ ఆకాశంలో మాయమైన ప్రయాణికుల సంగతి ఏమిటి. అసలు విషయం ఏమిటంటే.మొజాంబిక్ నుంచి అంగోలా వెళ్లున్న మొజాంబిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. ఆ విమానంలో 28 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారని తెలిపింది.

విమానం టీఎం 470 నిన్న సాయంత్రం 3.00 గంటల సమయంలో మోపాటొలో టెక్ ఆఫ్ అయింది. అనంతరం సాయంత్రం 6.40 నిమిషాలకు అంగోలా రాజధాని లువాండ చేరుకోవాల్సి ఉందని తెలిపింది. అయితే ఆ లోపు విమానం అదృశ్యమైందని వెల్లడించింది. ఉత్తర నమీబియా ప్రాంతంలో చిట్టచివరగా ఆ విమాన పైలెట్లతో మాట్లాడినట్లు విమానయాన అధికారులు వెల్లడించారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు కమాండర్ చెప్పారు.

అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు అపివేశామని చెప్పారు. ఉదయం నుంచి గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు ఆయన వివరించారు. అయితే విషయం తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారికి ఏమైందోనని, అధికారులు, కుటుంబం సభ్యులు ఆందోళ చెందుతున్నారు. అయితే గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles