Upa government ignores tdp cpm and ysrcp

UPA government , GoM invites only 5 political parties, TDP, YSRCP and tailender CPM, CPI,BJP,TRS and MIM

The Union home ministry has decided to invite only the congress,CPI,BJP,TRS and MIM only and left out the YSRC,TDP and CPM.

మంత్రుల సమావేశం నుండి మూడు పార్టీలు ఔట్

Posted: 11/07/2013 08:48 AM IST
Upa government ignores tdp cpm and ysrcp

ఈనెల 12 వ తేదీన జరగాల్సిన అఖిల పక్ష బేటీ నుండి టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం పార్టీలను కేంద్రహోంశాఖ బహిష్కరించింది. ఈనెల 5 లోపు గడువు ఇచ్చి, రాష్ట విభజన పై కేంద్ర మంత్రుల బృందానికి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరగా ఈ మూడు పార్టీలు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోగా,  విభజనను వ్యతిరేకిస్తూ జీవోఎంను బహిష్కరించాయి. దీంతో ఈ మూడు పార్టీలను కేంద్ర మంత్రుల బృందం సమావేశానికి పిలవలేదు.

జీఓఎంకు అభిప్రాయాలు తెలియజేసిన పార్టీలు అయిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ, ఎంఐఎంలను మాత్రమే చర్చలకు పిలిచింది. ఈ ఆహ్వానించిన ఐదు పార్టీల్లో ఒక్కో పార్టీతో జీఓఎం విడివిడిగా సమావేశమై చర్చిస్తుందని హోంశాఖ పేర్కొంది. ఒక్కో పార్టీకి అరగంట సమ యం కేటాయించారు. దీనికి సంబంధించి హోంశాఖ నుంచి ఆయా పార్టీల నేతలకు బుధవారం ఫోన్లో సమాచారం అందించినట్లు తెలిసింది.

మంత్రుల బృందానికి నివేదికలు ఇవ్వడానికి నిరాకరించిన  ప్రధాన ప్రతిపక్షం అయిన తెదేపా, సమైక్యాంధ్ర భజన చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఈ సమావేశానికి పిలవకపోవడం గమనార్హం అయితే.... విభజనను వ్యతిరేకించేవారిని పిలిచినా లాభం లేదని కేంద్రం భావించి తన పనిని తాను చక్కబెట్టుకునేందుకే పిలవలేదని మనం భావించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles