Telangana bill will be tabled in assembly botsa satyanarayana

telangana bill will be tabled in assembly botsa satyanarayana, transport minister Botsa Satyanarayana, PCC chief Botsa Satyanarayana, Telangana bill, Assembly, Telangana Bill in Assembly

telangana bill will be tabled in assembly botsa satyanarayana

టీ-బిల్లు పై బొత్స హామీ? టీ-నేతల్లో భయం

Posted: 11/06/2013 06:06 PM IST
Telangana bill will be tabled in assembly botsa satyanarayana

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏడు కొండల వెంకన్న సాక్షిగా కోరుకున్నపీసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం ఆయన ఈరోజు చేసిన ప్రకటనే కారణమని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జీవోఎంకు అన్ని రాజకీయ పార్టీల నివేదికలను పంపిన బొత్స. తెలంగాణ బిల్లు పై దుష్టిపెట్టినట్లు సమాచారం.

 

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. తీర్మానాన్ని కూడా పంపించాలని కోరినట్టు వెల్లడించారు. రెండు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తెలంగాణపై తమ పార్టీ మొదటి నుంచి క్లారిటీతో ఉందన్నారు. పీసీసీ చీఫ్ గా సీడబ్ల్యూసీ తీర్మానాన్ని గౌరవిస్తానని చెప్పారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని అన్నారు.

 

బొత్స ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని.. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలలుపట్టుకుంటున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే.. బిల్లు ఓడిపోవటం ఖాయమనే విషయం అందరికి తెలుసు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ బిల్లును అసెంబ్లీకి తెస్తానని చెప్పటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు.

 

అసలు బొత్సకు సమైక్యాంద్రకు మద్దతు తెలుపుతున్నాడా? లేక రాష్ట్ర విభజన కు మద్దతు తెలుపుతున్నాడో అర్థం కావటం లేదని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సత్తిబాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బొత్సకు ఇచ్చిన 100 పేజీల నివేదికను.. జీవోఎంకు కూడా పంపించి.. బొత్సకు ఎలాంటి తలభారం లేకుండ చేయటం జరిగింది. కానీ సత్తిబాబు సడన్ గా తెలంగాణ బిల్లు పై ద్రుష్టిపెట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles