Ashok babu for central government offices attack

ashok babu for central government offices attack, Central government offices, APNGOs leader Ashok Babu

ashok babu for central government offices attack

కేంద్ర ప్రభుత్వ కార్యాలయల ముట్టడి: బాబు

Posted: 09/12/2013 03:43 PM IST
Ashok babu for central government offices attack

ఏపీఎన్జీవోల సంఘం ఆద్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. కేంద్రం నుండి ప్రకటన వచ్చేవరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. సమ్మెను తీవ్రతరం చేసే అంశంపై ఈనెల 16 తర్వాత సమావేశమై చర్చిస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. శాంతియుత ప్రదర్శనను అడ్డుకునే పరిస్థితుల్లో ప్రజలకు ఏవిధంగా రక్షణ ఉంటుంది? ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి ఏర్పడే కమిటీలకు అధికారం ఉంటుందంటేనే నమ్మవచ్చు అని వ్యాఖ్యానించారు. సీమాంద్ర ఎంపీలందరూ సోనియాను కలిసి సీడబ్ల్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కొంతమంది పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఉద్యమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించడానికి సిద్దంగా ఉన్నామని అశోక్ బాబు అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles