Ys vijayamma fire on sushil kumar shinde

ys vijayamma fire on sushil kumar shinde, vijayamma writes to shinde, home minister sushil kumar shinde, ysrcp, ys jagan, ys jagan-ys vijayamma,

ys vijayamma fire on sushil kumar shinde, VIJAYAMMA WRITES TO SHINDE

షిండే వాస్తవాలు వక్రీకరించొద్దు: జగన్ తల్లి

Posted: 09/12/2013 02:28 PM IST
Ys vijayamma fire on sushil kumar shinde

రాష్ట్ర విభజనకు సిపీఎం మినహా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ అంగీకరించాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ధ్వజమెత్తారు. విభజనకు అఖిల రాజకీయ పక్షాలు సానుకూలంగా స్పందించినట్లు షిండే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అఖిలపక్షం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సీడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రం అట్టుడికిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై షిండేకు విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. సీడబ్ల్యుసి నిర్ణయాన్ని బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్‌, టిడిపి పార్టీలు మాత్రమే బలపరిచాయని గుర్తుచేశారు. సీపీఎంతో పాటు వైకాపా, ఎంఐఎం పార్టీలు అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను పక్కనపెట్టి తమకు అనుకూలంగా పరిస్థితులను మలచుకోవడం షిండేకు తగదన్నారు. గతేడాది డిసెంబర్‌ 28వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ నిర్ణయాన్ని స్పష్టం చేశామని చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యథాతధంగా ఉంచాలనేది తమ డిమాండ్‌గా చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles