సీమాంధ్రలో 34 కేంద్రాలలో ఈరోజు జరగవలసిన ఎమ్ సెట్ ఇంజినీరింగ్ విద్యార్థుల కౌన్సిలింగ్ సమైక్యాంధ్ర ఉద్యమం వలన జరగలేదు.
విశాఖపట్నంలో ఉపాధ్యాయులు ఇతర విద్యశాఖకు చెందిన సిబ్బంది ఎమ్ సెట్ కౌన్సిలింగ్ ని బహిష్కరించారు. విశాఖపట్నంతోపాటు అనంతపూర్, తిరుపతి, విజయవాడలలో ఆందోళనలవలన కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. చెదురుమదురుగా విద్యార్థి సంఘాలు ప్రతిఘటించటం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఎమ్ సెట్ కౌన్సిలింగ్ ని నిలిపివేస్తున్నామంటూ ఉన్నత విద్యా మండలి ప్రకటన వెలువడింది. రాష్టంలో మొత్తం 56 కేంద్రాలలో జరగవలసిన ఎమ్ సెట్ కౌన్సిలింగ్ లో 34 సీమాంధ్రలోను, 22 కేంద్రాలు తెలంగాణా ప్రాంతంలోనూ ఏర్పాటు చేయగా, ఆందోళనలు ఉధృతంగా ఉండటంతో అక్కడ నిలిపివేస్తున్నట్టుగా తెలియజేయటం జరిగింది.
ఉద్యమం జరుగుతున్నా కూడా ఎలాగైనా ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించాలని చూసిన ఉన్నత విద్యా మండలి ప్రయత్నాలు సఫలం కాలేదు. చాలా చోట్ల ఆందోళనలు, ఉద్రిక్త వాతావరణం, తోపులాటలు, అరెస్ట్ లు జరిగాయి. భారీ బందోబస్తులు చేసినా, విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాశాఖలోని ఇతర సిబ్బంది విధులను బహిష్కరించటంతో నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించవలసి వచ్చింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more