High court adjourns petitions connected to bifurcation

Petitions on Seemandhra strike, Petition for President Rule, High Court of AP, Seemandhra Employees strike, Agitation for Hyderabad capital

High Court adjourns petitions connected to bifurcation

హైకోర్టులో రాష్ట్రానికి చెందిన రెండు ముఖ్యమైన పిటిషన్లు

Posted: 08/19/2013 12:56 PM IST
High court adjourns petitions connected to bifurcation

ఎపిఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమని ఒక పిటిషన్, రాష్ట్రంలో పాలన స్థంబించిపోయింది కనుక రాష్ట్రపతి పాలన విధించాలంటూ వచ్చిన మరో పిటిషన్ మీద విచారణను హైకోర్టు ఈ నెల 26 కి వాయిదా వేసింది.  

ఎపి ఎన్జీవోల సమ్మెను నిలిపివేయాలని వచ్చిన పిటిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరం, పోలీస్ డిజిపిలకు నోటీసులు పంపించిన హైకోర్టు, సమ్మె జరుగుతున్నదని కోర్టుకెలా తెలస్తుంది అని ప్రశ్నించింది.  సమ్మెను ఆపటం కోసం ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదిని కూడా హైకోర్టు ప్రశ్నించింది.  

కీలకమైన రాష్ట్ర విభజన, రాజధాని విషయంలో హైద్రాబాద్ నగర సమస్య ఇలాంటి విషయాలన్నీ కోర్టు ద్వారా తేలేవి కాకపోయినా ఈ రోజు హైకోర్టు ఏం చెప్తుందా అని చాలామంది ఎదురుచూసారు.  ఎందుకంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా హైకోర్టు తీర్పుతో కచ్చితంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో తేడా వస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles