Greater rayalaseema demand

Greater Rayalaseema demand, Sonia Gandhi, Kurnool congress leaders, Separate State of Rayalaseema, Separate Telangana State

Greater Rayalaseema demand

రెండు కాదు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చెయ్యండి

Posted: 08/06/2013 03:33 PM IST
Greater rayalaseema demand

రాయలసీమలో కర్నూలుకు చెందిన నాయకులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ముందుగా రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యవద్దని, ఒకవేళ ముక్కలు చెయ్యాలనే గట్టిగా నిర్ణయించుకుంటే రెండు కాదు మూడు ముక్కలు చేసి రాయల సీమ ప్రాంతాన్ని గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చెయ్యమని తమ ప్రాంత అభిలాషగా తెలియజేసారు.

సోనియాగాందీని కలిసినవారిలో సుర్యప్రకాశరెడ్డితో పాటు ఏరాసు ప్రతాపరెడ్డి, కాటసాని రాంభూపాల రెడ్డి, కాటసాని రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి, మురళీ కృష్ణ, ఎస్పి వై రెడ్డి ఉన్నారు. 

అన్నీ విన్న సోనియా గాంధీ ఈ విషయాలనన్నిటినీ ఉన్నతస్థాయి కమిటీకి తెలపమని సూచించారట. 

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటిస్తే పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి ఎప్పటి నుంచ చేస్తున్న విభజనలు తెరమీదకు వస్తాయేమోనని భయపడుతూ ఆ కారణంగా కొంతకాలం తాత్సారం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇదే రాష్ట్రంలో మరో విభజనను ఊహించివుండకపోవచ్చు, చెప్పినా బహుశా దాన్ని సీరియస్ గా తీసుకుని ఉండకపోవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles