Telangana decision is rightly done says ds

DS approves Telangana, Former PCC President DS, Congress party, Gandhi family, Congress decision on Telangana, separate Telangana process started

Telangana decision is rightly done says DS

తెలంగాణా ఏర్పాటు సరైన నిర్ణయమే

Posted: 08/06/2013 01:48 PM IST
Telangana decision is rightly done says ds

తెలంగాణా జర్నలిస్ట్ ఫోరం జలవిహార్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణా విషయంలో కేంద్రం చేసిన ప్రకటన సబబే అని మాజీ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు.  సోనియా గాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ, డిసెంబర్ 9 న చిదంబరం ద్వారా చేసిన ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ తమ అభిప్రాయాలను తెలపటానికి అవకాశమిచ్చిందని, అందరి దగ్గర్నుంచీ సేకరించిన అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది కాబట్టి అందులో న్యాయముందని డిఎస్ చెప్పారు.

ప్రకటన తర్వాత ఈ మధ్యకాలంలో వెనకబడ్డ ప్రాంతాల గురించి మాట్లాడే అవకాశం అన్ని పార్టీలకూ అన్ని ప్రాంతాల నేతలకూ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించే గాంధీ కుటుంబం ఎవరికీ అన్యాయం చెయ్యదన్న తన అభిప్రాయాన్ని తెలియజేసిన డిఎస్, తెలంగాణా ఏర్పాటుకి అవసరమైన ప్ర్రక్రియ ప్రారంభమైందని, 6 నెలల లోపులోనే ఆ పని పూర్తవుతుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles