Nara lokesh babu secret tour in delhi

nara lokesh babu secret tour in delhi, Chandra Babu, nara lokesh babu, tdp, telugudesam party, tdp leaders,

nara lokesh babu secret tour in delhi

రహస్య యాత్రలో చినబాబు

Posted: 07/16/2013 08:10 AM IST
Nara lokesh babu secret tour in delhi

 

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ ఇటీవల కాలంలో అత్యంత రహస్యంగా ఢిల్లీలో పర్యటించి వచ్చారు. ఎవ్వరికీ తెలియకుండా తనకు అత్యంత సన్నిహితులైన ఒకరిద్దరు స్నేహితులను వెంట పెట్టుకుని ఉదయాన్నే ఢిల్లీ వెళ్లిన ఆయన సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆకస్మికంగా ఆయన ఢిల్లీ వెళ్లటంపై ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తనకు సన్నిహితులైన పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, నామా, రమేష్‌లకు కూడా సమాచారం ఇవ్వకుండా చినబాబు రహస్యంగా ఢిల్లీ వెళ్లడంపై ఎంపీల్లో కూడా చర్చ సాగుతోంది. లోకేష్ గతంలో ఒక టీవీ చానల్‌ను పర్యవేక్షించేవారు. ఈ మధ్య కాలంలో ఆ చానల్ పార్టీకి దూరమైందట! ఇటీవల చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రకు ఎక్కువ సమయం కవరేజీ కోసం కొన్ని చానళ్లకు కోట్లాది రూపాయలు చెల్లించారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరో ఒకరికి డబ్బులు చెల్లించే కంటే మనమే తెరవెనుక ఉండి ఒక చానల్‌ను నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చినబాబుకు వచ్చిందట.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles