Oracle software employee suicide in hyderabad

oracle software employee suicide in hyderabad, oracle employee, aswani oracle employee, aswani job last year, aswani working oracle, aswani chemical engineering, aswani bangalore, aswani suicide note, aswani mental pressure, aswani parents shock

oracle software employee suicide in hyderabad, Oracle Software Engineer Suicide In Hyderabad,

ఒరాకిల్‌ సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Posted: 07/09/2013 05:29 PM IST
Oracle software employee suicide in hyderabad

రోజు రోజుకి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆత్మహత్యల సంఖ పెరుగుతుంది. గత కొద్ది నెలల క్రితం నీలిమ అనే సాప్ట్ వేర్ ఉద్యోగిని కూడా ఇన్పోసిస్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మరో సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మదాపూర్ లోని కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మృతురాలు బెంగుళూరుకు చెందిన అశ్వినీ నాయర్‌. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని, జీవితంపై విరక్తి చెందే ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు ఆమె తన డైరీలో పేర్కొన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అశ్వినీ నాయర్ గత నెల 24న ఉద్యోగంలో చేరింది. గతంలో కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు అశ్వినీ నాయర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles